హీరో బాలకృష్ణకు ఎస్ ఎంఎస్ ల బెడద పట్టుకుంది. ఎన్టీఆర్ బివేర్, వైవియస్ మే ఆపర్ యూ ఎ రోల్. డోంట్ యాక్సెప్ట్. హీ బెట్రైడ్ మీ ఆల్ రెడీ అనే ఎస్ ఎంఎస్ రాష్ట్రంలోని కొంత మందికి సర్క్యులేట్ అవుతోందట. ఇది బాలకృష్ణకు తలనొప్పిగా మారింది. ఒక్క మగాడు సినిమాను దృష్టిలో పెట్టుకుని ఈ ఎస్ ఎంఎస్ ఒకరి నుంచి ఒకరికి అందుతూ వుంది. ఇది తప్పుడు ఎస్ ఎంఎస్ అని అర్థమవుతూనే ఉంది. కానీ ఇది తెచ్చి పెట్టే తంటా అంతా ఇంతా కాదని అంటున్నారు. సినిమా విడుదల అనంతరం దర్శకులకు ఇటువంటి అనేక తలనొప్పులు ఎప్పుడూ ఉంటాయి. ఇటువంటివి ఏవీ పట్టించుకోకుండా ముందుకు సాగడమే బాలకృష్ణ గానీ వైవియస్ చౌదరి గానీ చేయాల్సిన పని. వారు చేసేది కూడా ఇదే.