ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నా చేస్తా.. నిర్మాత బెదిరింపు
టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోలు చాలా మందే ఉన్నారు. తమ పాత్రల కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీకి వచ్చినా.. కష్టపడి ప్రత్యేక స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు. తన నటన, డాన్స్, యాక్షన్ ఇలా ఏ క్యాటగిరీ అయినా.. ఇరగదీశారు. నిజంగా ఆయనకు నవరసాలు అనేవి వెన్నెతో పెట్టిన విద్య. అందుకే ఏ పాత్ర అయినా.. ఎలాంటి డైలాగ్ అయినా అవలీలగా చేసేశాడు జూ ఎన్టీఆర్. ఆయన కోసం ఫ్యాన్ ఫ్యాన్సే కాదు. మూవీ మేకర్స్ కూడా వెయిట్ చేయాల్సింది. ఇక జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ ఆర్ ఆర్'బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఆమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన కోసం టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, పాన్ ఇండియా వైడ్ గా ఆయన మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం టాలీవుడ్లో సీక్వెల్స్ హవా కొనసాగుతోంది. ఒక్క సినిమా హిట్ అయితే.. చాలు దానికి స్వీకెల్ తీయాల్సిందే. ఇప్పటికే పలు సినిమాలు స్వీకెల్స్ తో ఫ్యాన్స్ ఎంటర్టై,న్ చేస్తున్నాయి. మూవీ మేకర్స్ కూడా కాసుల వర్షం కురిస్తున్నాయి. ఈ తరుణంలో చిత్ర దర్శక, రచయిత కోన వెంకట్ కు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి అని ఆలోచిస్తున్నారా..?

జూ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అదుర్స్ ఒకటి. ఈ మూవీ 2010లో వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే నటించి.. తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. మెయిన్ గా చారి పాత్రలో ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ అదుర్స్. అప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్‌ని ఆ అలాంటి పాత్రలో చూడలేదు. బ్రహ్మానందం, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్. నిజంగా ఎన్టీఆర్ ఫ్లే చేసిన చారి పాత్రను ఎవరూ మరిచిపోరు. ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడమో అనేలా ఉంటుంది. సీక్వెల్ ట్రెండ్ కొనసాగుతున్న వేళ.. ఎన్టీఆర్ మూవీస్ లో ఈ మూవీకి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. అందులో ఆ చిత్ర రచయిత కోన వెంకట్ కూడా ఒకరరంట.
ఆయన కూడా ఈ మూవీకి స్వీక్వెల్ రావాలని కోరుకుంటున్నారట. ఎప్పటికైనా అదుర్స్ 2 తెరకెక్కిస్తామని, ఆ సినిమాకు జూ. ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని కోన వెంకట్ అన్నారు. అవసరమయితే తాను తారక్ ఇంటిముందు ధర్నా చేశాననీ, ఆ సినిమాకు ఒప్పిస్తాననీ హామి ఇచ్చారు. చారి పాత్రను జూనియర్ ఎన్టీఆర్ తప్ప.. మరెవరూ చేయలేరనీ, ఎన్టీఆర్ కెరీర్లోనే అదుర్స్ బెస్ట్ మూవీ అన్నారు. ఆ క్యారెక్టర్, ఆ మాడ్యులేషన్ కేవలం ఎన్టీఆర్‌లాగా చేసే వారు ఇండియాలోనే లేరని కోన వెంకట్ బల్లగుద్దిమరి చెబుతున్నారు.
అలాగే.. గతంలో ఎన్టీఆర్‌పై రాజమౌళి చేసిన షాకింగ్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నాళ్ల క్రితం రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నాటి మెమోరీస్ గుర్తు చేసుకున్నారు. మీసాలు కూడా సరిగా రాని జూనియర్ ఎన్టీఆర్ చూసి.. 'నా కర్మకొద్ది తొలి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడేంట్రా' అని అనుకున్నాడట. పరిగెత్తే గుర్రంతో ఎవడైనా రేసులో పాల్గొంటారు. కుంటి గుర్రంతో రేసులో పాల్గొని..నెగ్గితేనే కదా అసలు మజా 'అని అనుకున్నారంట రాజమౌళి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ క్రేజీ కాంబోలో దేవర (Devara) అనే మూవీ వస్తుంది. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర 1 సెప్టెంబర్ 27 న వర్డల్ వైడ్ గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే చుట్టమల్లె సాంగ్స్ లాంచ్ చేయగా మిలియన్ల వ్యూస్ సాధించి.. నెట్టింటిని షేక్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











