twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SVSCపై ఫ్యామిలీ ప్రేక్షకుల అభిప్రాయాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా క్లీన్‌గా, కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉందని అంటున్నారు. బంధాలు, అనుబంధాలు, కోపాలు, తాపాలు, పంతాలు, పట్టింపులు, అల్లరి చేష్టలు చాలా బాగా చూపించారని, చాలా కాలం తర్వాత కుటుంబం మొత్తం వెళ్లి ఎంజాయ్ చేయదగ్గ మంచి సినిమా వచ్చిందని అభిప్రాయ పడుతున్నారు. సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో ఆనందం వ్యక్తం అవుతోంది.

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చూసిన కొందరు ఫ్యామిలీ ప్రేక్షకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి....

    1. లక్ష్మీ, గృహిణి, హైదరాబాద్
    'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని సినిమా. పట్టణ వాతావరణంలో అలసి సొలసిన జనానికి ఈ సినిమా మరింత సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ విలువలు, తెలుగు సాంప్రదాయాలు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్.

    2. మహేశ్వర రెడ్డి, ప్రైవేట్ ఉద్యోగి, హైదరాబాద్
    సినిమా ఎక్కడ బోరింగ్ లేకుండా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా బాగా తీసాడు. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలో ఎలాంటి అశ్లీలత లేకుండా నీట్ గా ఉంది. సంక్రాంతి పండగ పూట కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తే ఆనందం మరింత వెల్లువిరుస్తుంది.

    3. సురేఖ, పీజీ విద్యార్థిని, హైదరాబాద్
    'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో అందమైన కుటుంబాన్ని వెండి తెరపై ఆవిష్కరించారు. మహేష్ బాబు, వెంకటేష్ నటన బాగుంది. సమంత బబ్లీగా, అంజలి సాంప్రదాయ బద్దంగా మెప్పించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

    4. వాసవి, గృహిణి, హైదరాబాద్
    మంచి తనంతో మెలిగితే అందరికీ మంచి జరుగుతుందనే విషయాన్ని సినిమాలో చాలా బాగా చూపించారు. ప్రతి వ్యక్తిని గౌరవించాలి, వ్యక్తికి వ్యక్తిగా విలువ ఇవ్వాలి. డబ్బే జీవితం కాదు....బంధాలు, అనుబంధాలు, మన మంచి కోరే నలుగురు మనుషులు ఉన్నప్పడే పూర్తి సంతృప్తి దొరుకుతుంది. ఇలాటి మంచి మాటలు చెప్పే సినిమాలు ఈ మధ్య కరువయ్యాయి. ఫ్యామిలీ సినిమాలకు కలెక్షన్లు రావడం లేదని తెలుగు సినిమాల్లో బూతు, హింస పెట్రేగిపోతోంది. అలాంటి సినిమాలతో పోటీ పడుతూ ఇలాంటి మంచి చిత్రం చేసిన దర్శక నిర్మాతలను, అందులో నటించిన స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబులను అభినందించాల్సిందే. మంచి విషయాలు చెప్పడంతో పాటు సినిమా వినోదాత్మకంగా ఉంది.

    5. రాజేష్, ప్రైవేట్ ఉద్యోగి, హైదరాబాద్
    సినిమా ఫ్యామిలీ ప్రేక్షకుల తో పాటు, యూత్‌కు కూడా నచ్చే విధంగా తెరకెక్కించారు. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. వెంకీ తన పాత్రకు తగిన విధంగా బాగా చేసాడు. మహేష్, సమంత, అంజలి తమ నటనతో మంచి ఎంటర్ టైన్మెంట్ పంచారు. అసలు సినిమా అయిపోయిందనే విషయమే తెలియలేదు. మరింత సేపు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కలిగింది.

    English summary
    Seethamma Vakitlo Sirimalle Chettu gets good response from Family audience. It is a complete family drama with a few commercial elements. The performances of Mahesh Babu and Venkatesh are the main attractions in the film. Srikanth Addala's brilliant narration and dialogues, Mickey J Meyer's melodious music, KV Guhan's beautiful picturisation are its other highlights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X