వత్తిడిని తగ్గించుకోవటానికే అలా..దగ్గుపాటి రాణా
ఒత్తిడి తగ్గించుకోవటానికి తాను పాటించే పద్ధతులను గురించి రాణా మీడియాకు చెబుతూ ''షూటింగ్‌లు లేనప్పుడు ఇంటి దగ్గర ఉండటం ద్వారా వత్తిడి తగ్గించుకొని రిలాక్స్ అవుతుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో గడుపుతుంటాను. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే అన్ని రకాల సినిమాలు చూస్తూ పొద్దుపుచ్చుతాను. లేకుంటే నా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తుంటాను. ఆ విధంగా వత్తిడిని దూరం చేసుకుంటాను అన్నారు. ప్రస్తుతం రాణా...ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో నా ఇష్టం చిత్రం చేస్తున్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న డిపార్టమెంట్ లోనూ చేస్తున్నారు. రీసెంట్ గా ఆయనకు డిపార్టమెంట్ సెట్లో గాయమైంది.
మళ్ళీ కోలుకుని ఆయన తిరిగి షూటింగ్ కి హాజరయ్యారు. ఇక ఆయన తనకి బాబాయ్ వెంకటేష్ లాగ ఆధ్యాత్మిక భావాలు లేవని చెప్తూ... ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఒకానొక అతీత శక్తిని నమ్ముతాను. నేను అంతగా ఆధ్యాత్మిక వ్యక్తిని కాను. కానీ అన్ని మతాలను నేను గౌరవిస్తాను. లౌకిక దేశమైన భారత్‌లో కుల, మత, ప్రాంతాలవారీ బేధాలు ఉండరాదు. సిద్ధాంతాలతో కూడిన జీవితాన్ని సాగించేందుకు ప్రతి ఒక్కరూ ఆ భావనను విశ్వసించాలనేది నా కోరిక అన్నారు. ఇక కంటిన్యూగా షూటింగ్‌లతో నా దినచర్య కొనసాగుతున్న కారణంగా పూజలు లేకుంటే ప్రార్ధనలు చేసేందుకు నాకు కావలసినంత సమయం దొరకదు. కానీ సమయం దొరికినప్పుడల్లా నా కుటుంబంతో గడిపేస్తుంటాను. ముందే చెప్పాను కదా నేనంతగా ఆధ్యాత్మిక వ్యక్తిని కాను అని. కానీ వ్యక్తిగా నిజాయితీగా ఉండటమేనది చాలా ముఖ్యం అన్నారు.


Click it and Unblock the Notifications











