ఉదయ్ కిరణ్ భార్య మనోవేదన..!(మీట్ ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ మరణం అభిమానులకు మాత్రమే కాదు....కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని నింపింది. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ భార్య విషిత మనోవేదన వర్ణనాతీతం. పెళ్లయిన సంవత్సరం గడిచిందో లేదో భర్త దూరమయ్యాడు. జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చిన ఉదయ్ తనను వదిలి కంటికి కనిపించకుండా అనంత లోకాలకు వెళ్లి పోయాడు. భర్త మరణంతో ఆమె ఎంత మనో వేదనకు గురవుతుందో ఆమె కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఉదయ్ కిరణ్ భార్య విషిత, ఆమె కుటుంబ సభ్యులు ఉదయ్ కిరణ్ సంతాప సభను హైదరాబాద్ లోని ఫిల్మ్ క్లబర్ లో ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆమె ఉదయ్ కిరణ్ గురించిన జ్ఞాపకాలను గుర్త చేసుకుని కన్నీరు పెట్టారు. ఈ కండోలెన్స్ మీట్లో విషిత తల్లిదండ్రులో పాటు, నటుడు నాని దంపతులు కూడా పాల్గొన్నారు.

కండోలెన్స్ మీట్ కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

విషిత ఆవేదన

విషిత ఆవేదన


ఉదయ్ కిరణ్ సమస్య గురించి ముందే తెలిసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని ఆయన సతీమణి విషిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ కిరణ్ మృతిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని విషిత గురువారం అన్నారు.

ఒంటరినైపోయా

ఒంటరినైపోయా


ఉదయ్‌ కిరణ్‌ను తాను అనవసరంగా పెళ్లి చేసుకున్నాని, ఇప్పుడు తన జీవితం ఒంటరిగా మిగిలిపోయిందని అతని భార్య విషిత ఇటీవల పోలీసుల విచారణలో ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కారణం అదే...

కారణం అదే...


సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, సహచర నటులు మాట్లాడకపోవడం, సినీ కార్యక్రమాలకు పిలవకపోవడం, వందేళ్ల సినిమా పండుగకు సైతం ఆహ్వానం అందకపోవడం, ఇవన్నీ ఉదయ్‌పై ప్రభావం చూపాయని ఆమె చెప్పారు. విలువైన స్థలాలు చాలానే వున్నా వాటిని అమ్మి పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో విఫలమయ్యాడని విషిత పోలీసులకు చెప్పింది.

తొక్కేసారా?

తొక్కేసారా?


తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు తనకు సినిమా అవకాశాలు లేకుండా చేస్తున్నారని గ్రహించిన ఉదయ్ కిరణ్ మనం చెన్నయ్‌కి వెళ్దామని, అక్కడ సినిమా అవకాశాల్లో ప్రయత్నిద్దామని చెప్పేవాడని, దాంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నామని, నెలకు రూ.25 వేల అద్దెతో ఓ ఇంటిని తీసుకుని 3 నెలల అడ్వాన్స్ కూడా చెల్లించామని, కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని విషిత పోలీసులకు తెలిపింది.

అనేక మలుపులు

అనేక మలుపులు


ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. సినిమా అవకాశాలు రాకపోవడం, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులు, చేసిన అప్పులు తీర్చలేక.. ఇలా కేసు మలుపులు తిరుగుతోంది. అనుమానస్పద మృతిగా భావించి తొలుత పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు లేక, తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తెలిసింది.

ఏది నిజం?

ఏది నిజం?


అంతలోనే ఉదయ్ ఆత్మహత్యకు ఆయన మాజీ మేనేజర్ మున్నా కారణమని పలు కథనాలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ మొదలుపెట్టి మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ కిరణ్ వ్యవహార శైలికి సంబంధించి మున్నా నుంచి సమాచారాన్ని రాబట్టారు.

సాగుతూనే ఉన్న విచారణ

సాగుతూనే ఉన్న విచారణ


తాను తీసుకున్న అప్పునకు ఉదయ్ కిరణ్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మున్నా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా ముందుగా ఉదయ్ కిరణ్ భార్య విషిత, అత్తామామలను, అపార్ట్‌మెంటలోని కుంటుంబాలను విచారించిన పోలీసులు కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణాలపై ఆరా తీశారు.

ఉదయ్ కిరణ్ పై సినిమా

ఉదయ్ కిరణ్ పై సినిమా


తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఉదయ్ కిరణ్ సినీ జీవితం, ఆత్మహత్యకు దారితీసిన అంశాలను బేస్ చేసుకుని ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కాలి సుధీర్ ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

టార్గెట్ ఎవరు?

టార్గెట్ ఎవరు?


ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడటానికి........దారి తీసిన అంశాల వెనక ఓ పెద్దమనిషి హస్తం ఉందని పలువురు బహిరంగ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీలో ఏ చూపించబోతున్నారు అనే అంశం ఆసక్తి కరంగా మారింది. ఉదయ్ కిరణ్‌కు ఉన్న పాపులారిటీ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ చిత్రానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X