వెంకీ-మహేష్‌లపై ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరణ
విక్టర్ వెంకటేష్-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి నటిస్తుండగా, మహేష్ బాబు సరసన సమంత ఎంపికైంది. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులో జరుగుతోంది.
యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం....అక్కడ ఫ్యామిలీ సాంగు చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, జయసుధ ఈ సాంగులో కనిపించనున్నారు. ''ఆరు అడుగుల అందగాడు వస్తాడె'' అంటూ ఈ పాట సాంగుతుందని సమాచారం.
తమిళనాడులో జరుగుతున్న ఈ తాజా షెడ్యూల్ మార్చి 3 వరకు జరుగనుంది. అనంతరం ప్రొడక్షన్ టీం తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈచిత్రానికి మిక్కీజె మేయర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











