రజనీ మీద సినిమాపై సౌందర్య చిర్రుబుర్రులు
బాడీగార్డ్ సూపర్ సక్సెస్‌తో మంచి ఊపుమీద ఉన్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అతుల్ అగ్నిహోత్రి తన తర్వాతి ప్రాజెక్టు కోసం గ్రౌండ్ వర్క్ ప్రారంభించాడు. అతుల్ గతంలో ముంబై మిర్రర్ పత్రికతో మాట్లాడుతూ రజనీ జీవితంపై సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై రజనీ చిన్న కూతురు సౌందర్య ముంబై మిర్రర్ తో మాట్లాడుతూ ఆ ప్రాజెక్టు గురించి మాకే తెలియదు, ఎలాంటి సంప్రదింపులు లేకుండానే మేము ఈ ప్రాజెక్టును ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే..ఈ సినిమా దర్శకుడు బిప్తిస్తా వాదన మరోలా ఉంది. రజనీకాంత్‌కి ఈ సినిమా గురించి తెలుసని, స్క్రిప్టు పరిశీలిస్తున్నారని, ఈ విషయం ఆయన మేనేజరే మాకు చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉంటే రజని కుటుంబం సినీ తారల జీవితంపై ఓ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అందుకే రజనీ బయోపిక్ పై సౌందర్య తన అసంతృప్తి వ్యక్తం చేశారనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











