twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్రసీమలో విషాదం: ప్రముఖ నటుడు మృతి.. ముఖ్యమంత్రి సంతాపం

    |

    అలనాటి బాలీవుడ్‌ నటుడు, ప్రముఖ రంగస్థల కళాకారుడు డాక్టర్‌ శ్రీరామ్‌ లాగూ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య కారణాల వల్ల ఆయన మృతి చెందారని తెలిసింది. పుణెలోని తన సొంత నివాసంలో శ్రీరామ్‌ లాగూ తుది శ్వాస విడిచారు.

    వందకు పైగా సినిమాల్లో..

    వందకు పైగా సినిమాల్లో..

    1927లో నవంబర్ 16వ తేదీన మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన శ్రీరామ్‌ లాగూ.. మరాఠీ రంగస్థల నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో కాలుమోపి రాణించారు. ఇప్పటివరకు ఆయన వందకు పైగా హిందీ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించారు.

    90 దశకంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా..

    90 దశకంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా..

    మరాఠీలో అభిమానులు శ్రీరామ్‌ లాగూని ముద్తుగా నట సమ్రాట్‌ అని పిలుస్తుంటారు. ఆయన మంచి నటుడు మాత్రమే కాదు డాక్టర్ కూడా. 90 దశకంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఎన్నో సినిమాలు సక్సెస్ అయ్యాయి. నటుడిగా చేస్తూనే మరాఠీలో 20పైగా నాటకాలకు ఆయన దర్శకత్వం వహించారు.

    ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు.. పలు అవార్డులు రివార్డులు

    ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు.. పలు అవార్డులు రివార్డులు

    యువకుడిగా ఉన్నపుడు కొన్ని రోజులు ఈఎన్‌టీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసిన ఆయన.. ఆ తర్వాత సినిమాలపై మక్కువతో సినిమాలు, నాటకాలు చేశారు. ఆయన నటనకు గాను ప్రభుత్వం నుంచి పలు అవార్డులు రివార్డులు కూడా అందాయి. ఘరొండ చిత్రంలో ఉత్తమ నటనకుగానూ 1978లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు.

    చెప్పుకోదగిన సినిమాలు

    చెప్పుకోదగిన సినిమాలు

    కెరీర్ మొత్తంలో 211 సినిమాలకు పైగా సినిమాలు చేశారు శ్రీరామ్‌ లాగూ. ఆయన నటించిన మరాఠీ చిత్రాల్లో సింహాసన్ (1980), సామన (1974), పింజ్రా (1973) ప్రముఖమైనవి. బాలీవుడ్‌ చిత్రాలైన జమానే కో దిఖానా హై (1981), ఖుద్దార్‌ (1994), లావారిస్‌ (1981), ఇన్‌సాఫ్‌కా తారాజు (1980) మొదలైన చిత్రాల్లో నటించారు.

    కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి సంతాపం

    కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి సంతాపం

    శ్రీరామ్‌ లాగూ మృతి పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, సుశీల్ కుమార్ షిండే సంతాపం వ్యక్తం చేశారు. అలాగే పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన మృతిపై తమ సంతాపం తెలిపారు.

    English summary
    Veteran actor Shriram Lagoo died of age-related issues. Maharshtra CM paid tribute to the legendary actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X