గాయకుడు యేసుదాసుకీ రోల్ చేస్తున్న చిత్రం
ప్రముఖ గాయకుడు యేసుదాసు త్వరలో నటుగా అవతారమెత్తనున్నారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో రూపొందనున్న "క్లియోపాత్ర ...ది సింబల్ ఆఫ్ బ్యూటీ" అనే చిత్రంలో ఆయన ఓ కీల్ రోల్ ని ప్లే చేయనున్నారు. రాజన్ సంక్రాద్రి అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని టికెఆర్ నాయర్ నిర్మిస్తున్నారు. నవంబర్ లో ప్రారంభమయ్యే ఈ చిత్రం ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమని చెప్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత నాయర్ మాట్లాడుతూ..ఈ చిత్రంలో అశ్వతి, ప్రేరణ, పూజ శర్మ హీరోయిన్స్ గా చేస్తున్నారు. వీరిలో ఎవరు క్లియోపాత్ర అనేది తెరపైన చూసి తెలుసుకోవాల్సిందే. వినీత్, మనోజ్ జైన్ హీరోలుగా చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ పాలక్కడ్, యూరప్, ఊటీలలో జరగనుంది. ఈ చిత్రానికి మురళి కృష్ణ కెమెరా,శరత్ కుమార్ స్క్రీన్ ప్లే, డైలాగులు, ఆర్ట్ రజిత, ఎడిటింగ్ విజయ్ కుమార్, సంగీతం రాజమణి అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











