సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. అగ్ర తమిళ హీరోలకు డబ్బింగ్ చెప్పిన శ్రీనివాస మూర్తి కన్నుమూత!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకేసారి అసలు వరుస విషాధాలు చోటు చేసుకుంటూ ఉండడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. శుక్రవారం రోజు ప్రముఖ నటీమణి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్త వచ్చిన కొన్ని గంటల్లోనే మరో సినీ ఆర్టిస్టు కన్నుమూయడం అందరికీ షాక్ కు గురి చేసింది. ఇక కొద్దిసేపటి క్రితం ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి కన్నుమూశారు. ఆయన చాలా మంది అగ్ర హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు అందుకున్నారు.
ముఖ్యంగా తమిళ హీరో సూర్య తెలుగులో ఎలాంటి సినిమా చేసిన కూడా శ్రీనివాసమూర్తి డబ్బింగ్ అందించేవారు. ఇక తర్వాత అజిత్ విక్రమ్ కూడా తెలుగులో విడుదల చేసిన ప్రతి సినిమాలకు కూడా ఆయన డబ్బింగ్ అందిస్తూ వస్తున్నారు. ఇక మలయాళం హీరో మోహన్లాల్ కూడా తెలుగులో ఎప్పుడూ నటించిన కూడా శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. ఇక ఆ విధంగా దాదాపు 1000 సినిమాలకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపును పొందారు.

అయితే నేడు ఉదయం శ్రీనివాసమూర్తి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. చెన్నైలోనే నివాసం ఉంటున్న శ్రీనివాసమూర్తి ఉదయం ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. ఇక ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ అప్పుడే ప్రాణాలు కోల్పోయారు. సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ దక్షిణ భారత నటులకు తన గాత్రాన్ని అందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి.
శ్రీనివాస మూర్తి తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నాడు. ఇక తెలుగు హీరోలలో రాజశేఖర్ కు కొన్నిసార్లు సాయికుమార్ డబ్బింగ్ చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు కూడా శ్రీనివాసమూర్తి రాజశేఖర్ కు డబ్బింగ్ చెప్పేవారు. హాలీవుడ్ సినిమాలు సౌత్ లో విడుదలైనప్పుడు కూడా ఆయన డబ్బింగ్ చెప్పేవారు. ఇక ఆయన పలు సినిమాలకు మంచి అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. దాదాపు 1000 సినిమాలకు పైగా శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











