రాజశేఖర్‌పై ఫ్యాన్స్ కామెంట్.. కంటతడి పెట్టిన జీవిత
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌కు కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ చేరింది. యువ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రూపొందించిన పీఎస్వీ గరుడవేగ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.
Recommended Video

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌కు కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ చేరింది. యువ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రూపొందించిన పీఎస్వీ గరుడవేగ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. చాలా రోజుల తర్వాత సక్సెస్‌ను రుచి చూసిన రాజశేఖర్ ప్రస్తుతం ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నారు. విజయం అందించిన భావోద్వేగంలో జీవిత రాజశేఖర్ కన్నీరు పెట్టుకోవడం అభిమానులను కలిచివేసింది.

గరుడవేగలో పవర్ ఫుల్ పాత్ర
అంకుశం, మగాడు లాంటి ఘన విజయాలతో స్టార్ హీరోగా ప్రేక్షకుల చేత జేజేలు అందుకొన్న రాజశేఖర్ ఇటీవల కాలంలో దాదాపు తెలుగు తెర నుంచి కనుమరుగై పోయారనే అంతగా అనిపించింది. గడ్డం గ్యాంగ్ చిత్రం తర్వాత ఆర్థికంగా నష్టపోయాడు. ఆ తర్వాత సినిమాలు చేసిన దాఖలాలు లేవు. తాజాగా చందమామ కథలు, గుంటూరు టాకీస్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన పీఎస్వీ గరుడ వేగ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రను పోషించాడు.

ఫస్ట్ షో నుంచి సూపర్ టాక్
గురుడవేగ చిత్రం తొలి ఆట నుంచే మంచి టాక్‌ను కలెక్షన్లను సాధిస్తున్నది. ఓవర్సీస్ రిపోర్ట్స్ బాగా ఉండటం, సినీ ప్రముఖులు కూడా సానుకూలంగా ట్వీట్లు చేయడం గరుడవేగకు కలిసివచ్చింది. గురుడవేగ చిత్రానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో రాజశేఖర్, జీవితతోపాటు చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఓ థియేటర్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా రాజశేఖర్ ప్రేక్షకులతో కలిసి పోయారు. తాను ఓ సాధారణమైన వ్యక్తిని అని అన్నారు. గరుడ సినిమాకు ప్రేక్షకులు సానుకూలంగా స్పందించడపై ఆనందం వ్యక్తం చేశారు.

అలా రాజశేఖర్ మాట్లాడుతుండగా, పక్కనే ఉన్న ఓ అభిమాని
రాజశేఖర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. రాజశేఖర్ అసాధారణ వ్యక్తి అని అన్నారు. దాంతో పక్కనే ఉన్న జీవిత రాజశేఖర్ భావోద్వేగానికి లోనైయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఈ సినిమాను హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు.

జీవిత కంటతడి
గురువారం తన సోదరుడు మురళిని కోల్పోయి పుట్టెడు బాధలో వున్న జీవిత రాజశేఖర్‌కు గరుడ వేగ హిట్ కొట్టడం కొంత ఉపశమనం లభించింది. ఎన్నో రోజులుగా విజయం లేకుండా బాధపడుతున్న రాజశేఖర్‌ను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఫ్యాన్స్ కురిపిస్తు్న అభిమానాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











