అమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనం

Recommended Video

అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్‌లో.. అభిమాని హల్‌చల్..!

పవర్ స్టార్.. పేరుకు తగ్గట్లే శిఖరాగ్రమంతటి క్రేజ్. ఆయన కనిపిస్తే చాలు.. జన్మ పునీతమైందనుకునే ఫ్యాన్స్. ఆయన మాటైనా.. మేనరిజమైనా.. వారిని ఉర్రూతలూగిస్తుంది.

చొక్కాలు చించుకునే స్థాయి అభిమానం.. ఫ్యాన్స్ గొంతు నుంచి బిగ్గరగా 'పవర్ స్టార్.. పవర్ స్టార్..' అని వినిపిస్తుంటే.. కొన్నిసార్లు పవన్ సైతం నిశ్చేష్టుడై వాళ్లనలా చూస్తుండిపోతాడు.

బయటివాళ్లకు ఈ వ్యవహారమంతా ఓ ఫ్యూడల్ తత్వం లాగే అనిపించవచ్చు. కానీ పవర్ స్టార్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు మధ్య దూరాలనుకోవడం ఓ దుస్సాహాసానికి ఒడిగట్టడం లాంటిదేనని ఇదివరకే రుజువైన సంగతి తెలిసిందే.

 అదే రిపీట్ అయింది:

అదే రిపీట్ అయింది:

పవన్ ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. తాను బయటకు వస్తే ఫ్యాన్స్ ఎక్కడ మీద పడిపోతారోనని. అలా కొన్నిసార్లు ప్రజా సమస్యలపై స్పందించాల్సిన పర్యటనలను కూడా తాను వాయిదా వేసుకున్నట్లు గతంలో చెప్పుకున్నారు. పవన్ చెప్పినట్లే అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లోను జరిగింది. పవన్ వేదికను ఎక్కిన వేళ.. ఓ యువకుడు అమాంతం ఆయనపై పడిపోయినంత పనిచేశాడు.

అభిమాని హల్‌చల్:

అభిమాని హల్‌చల్:

ఆర్టిస్టుల స్పీచుల కన్నా.. అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్‌లో ఆ అభిమాని చేసిన హల్‌చలే ఎక్కువమందికి గుర్తుండిపోయింది. యాంకర్ సుమ.. పవన్ కల్యాణ్ ను వేదిక మీదకు పిలవడమే ఆలస్యం.. పవన్ అలా స్టేజీ ఎక్కాడో లేదో.. ఆ యువకుడు అమాంతం వచ్చి ఆయన కాళ్లు పట్టేసుకున్నాడు.

 సాష్టాంగ నమస్కారం:

సాష్టాంగ నమస్కారం:

చూడటానికి బక్క పల్చగా ఉన్న అతను.. పవన్ కాళ్లకు నమస్కరిస్తూ.. సాష్టాంగపడిపోయినంత పనిచేసేశాడు. ఇంతలో అప్రమత్తమైన బౌన్సర్లు అతన్ని వెనక్కి లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా.. పవన్ వారిని వారించాడు. ఆ అభిమాని కోరికేంటో తెలుసుకుని.. అతనితో సెల్ఫీ దిగి పంపించాడు.

పవన్ ఔన్నత్యం

ఫ్యాన్సే తనకు కొండంత అండ అని, నిరాశ, నిస్పృహలు వెంటాడిన సమయంలోనూ మీవల్లే మళ్లీ మామూలు మనిషిని అయ్యానని అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ లోనూ చెప్పారు. చెప్పడమే కాదు.. వారిపై తన ప్రేమ ఎలాంటిదో వేదిక పైనే చూపించేశారు.

అభిమానంతో తన కాళ్ల మీద పడ్డ యువకున్ని.. బౌన్సర్లు లాక్కెళ్తుంటే చూడలేక.. వాళ్లను వారించి అతని కోరిక తెలుసుకుని సెల్ఫీ దిగి పంపించారు. ఇలా పవన్ మరోసారి ఫ్యాన్స్ పట్ల తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X