Baby 2 Story: లీకైన బేబి 2 కథ.. అదే ట్విస్ట్.. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అంటే?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం బేబి (Baby). హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికీ పలు సెంటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తీయమని డైరెక్టర్ సాయి రాజేష్ ను ప్రేక్షకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బేబి 2 (Baby 2) స్టోరీ ఇదేనని సోషల్ మీడియాలో ఓ కథ తెగ వైరల్ అవుతోంది.

రిక్వెస్ట్: ఓ అమ్మాయి చేతిలో ప్రేమ పేరుతో మోసపోయిన యువకుడి కథ ఆధారంగా తెరకెక్కిన బేబి సినిమాకు యావత్ తెలుగు ప్రేక్షకులు అంతా జై కొడుతున్నారు. జూలై 14న విడుదలైన ఈ సినిమా లాభాల సునామీ తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా బేబి 2ను తెరకెక్కించాలని దర్శకుడికి వినతులు వస్తున్నాయి. ఈ సమయంలో వాట్సాప్ లో క్రియేట్ చేసిన బేబి 2 (Baby 2 Movie) స్టోరీ హల్ చల్ చేస్తోంది.

Baby 2 Story:

పగ తీర్చుకునేందుకు: వైష్ణవికి పెళ్లయిన 20 సంవత్సరాల తర్వాత ఆమె కూతురు అమెరికాలోని ఓ కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఒక అబ్బాయిని వైష్ణవి కుమార్తె ప్రేమిస్తుంది. వీళ్ల లవ్ స్టోరీ ప్రీ ఇంటర్వెల్ వరకు సాగుతుంది. ఇంటర్వెల్ లో వైష్ణవి కూతురు ప్రేమించిన అబ్బాయి విరాజ్ కొడుకు. అప్పటికే అమెరికాలో స్థిరపడిపోయిన విరాజ్.. తనను మోసం చేసిన వైష్ణవి మీద పగ తీర్చుకునేందుకు ఆమె కూతురుని లవ్ చేయమని కొడుకుకి చెప్పి పంపుతాడు.

వీడియోలు డిలీట్: వైష్ణవి కూతురుకి తన తల్లి నిజ స్వరూపం ఏంటో చూపించిన తర్వాత కొడుకుతో మోసం చేయించాలనేది విరాజ్ ప్లాన్. అయితే వైష్ణవి కూతురుని నిజంగానే ప్రేమించిన విరాజ్ కొడుకు అసలు విషయం ఆ అమ్మాయికి చెబుతాడు. దీంతో తనను నిజంగా ప్రేమిస్తే తమకు అప్పటికే తీసుకున్న తమ ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయమని అంటుంది. దీంతో వాటన్నింటిని విరాజ్ కొడుకు డిలీట్ చేస్తాడు.

Baby 2 Story:

జైలుకు పంపించి: వీడియోలు డిలీట్ చేసిన తర్వాత ఇండియాకు వెళ్లిన వైష్ణవి కూతురు పెళ్లి చేసుకుందాం రమ్మని విరాజ్ కొడుక్కి కాల్ చేసి చెబుతుంది. తండ్రి విరాజ్ కు అబద్ధాలు చెప్పి అతని కొడుకు ప్రేమించిన అమ్మాయి కోసం ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చిన విరాజ్ కొడుకు తనను వేధిస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ చేసి జైలుకు పంపిస్తుంది వైష్ణవి కూతురు.

మరో ఆటో కొనిచ్చి: నాన్నను మోసం చేశాను. ఇలా అమ్మాయిల చేతిలో మోసపోయాను అని బాధపడుతూ చనిపోదామనుకున్నా విరాజ్ కొడుకుని ఓ పెద్దాయన వచ్చి ఆపుతాడు. కట్ చేస్తే ఆ పెద్దాయన ఆనంద్. విరాజ్ కొడుకుని తన ఆటోలో ఎక్కించుకుని రెండు డైలాగ్స్ చెప్పి ఇంకో ఆటో కొనిస్తాను. నువ్వు ఇక్కడే తిప్పుకో అని చెబుతాడు. ఇదే క్లైమాక్స్ అంటూ మీమ్స్ పేజీల్లో ఓ స్టోరీ వైరల్ అవుతోంది.

Baby 2 Story:

క్లైమాక్స్ ట్విస్ట్: అయితే ఈ స్టోరీకి చిన్న మార్పు చేశాడు ఓ నెటిజన్. హీరో నిజానికి విరాజ్ కొడుకు కాదు. ఆనంద్ కొడుకు. ఒక ఎగ్జిబిషన్ లో చిన్నప్పుడే తప్పిపోతే విరాజ్ కు దొరుకుతాడు. ఆ పిల్లాడిని విరాజ్ దత్తత తీసుకుంటాడు. ఆనంద్ ది నిజమైన ప్రేమ కాబట్టి తండ్రిలాగే కొడుకు వైష్ణవి కూతురుని నిజంగా ప్రేమిస్తాడు. అందుకే నిజం చెబుతాడు. ఇది క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్.

పచ్చబొట్టు ద్వారా: ఇక ఆ కుర్రాడి చేతిపై AV అనే పచ్చ బొట్టు ద్వారా ఆనంద్ కొడుకని తెలుస్తుందట. పచ్చబొట్టు ఉన్న కుర్రాడి పేరే ఆనంద్ వైష్ణవ్. ఇలా నెటిజన్లు బేబి 2 స్టోరీని అల్లేశారు. సాయి రాజేష్ కూడా ఇలా ప్లాన్ చేసి ఉండడు అంటూ ఈ స్టోరీని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X