దుమ్ము రేపుతోన్న ఫోటో: చిరు వెనకాల చేతులు కట్టుకుని పవన్!..
ఏం చేసైనా సరే.. తొలి ఆటకే 'అజ్ఞాతవాసి' సినిమా చూసేయాలన్న ఆత్రుత పవన్ అభిమానులకు కంటి మీద కునుకు కూడా లేకుండా చేసింది. తెరపై పవన్ బొమ్మ చూస్తే తప్ప.. అభిమానులకు మనసంతా ఏదో తెలియని వెలితి.
Recommended Video

ఆ వెలితే గంటలు గంటలు పడిగాపులు కాచైనా సరే.. తొలి ఆటకే టికెట్ సినిమా చూసేయాలన్న ఆత్రుతను మరింత పెంచింది. అందుకే 'అజ్ఞాతవాసి' థియేటర్లన్నీ ఇప్పుడు అభిమాన జాతరను తలపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే..

'మెగా' అభిమానం:
ఓవైపు థియేటర్ల వద్ద పవన్ అభిమానులు 'అజ్ఞాతవాసి' ఫీవర్‌తో ఊగిపోతుంటే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు 'అజ్ఞాతవాసి' ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోగా.. మరికొంతమంది 'అజ్ఞాతవాసి' పోస్టర్లను ఎడిట్ చేసి 'మెగా' అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఫ్యాన్ మేడ్ పోస్టర్:
'అజ్ఞాతవాసి' నిమాకు సంబంధించిన ఓ పోస్టరులో కుష్బూ సోఫాలో కూర్చొని ఉంటే.. వెనకాలే పవన్ నిలుచుని ఉండటాన్ని గమనించవచ్చు. ఇప్పుడా పోస్టరును ఎడిట్ చేసి.. కుష్బూ స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని కూర్చోబెట్టేశారు అభిమానులు. మెగా బ్రదర్స్ కాంబినేషన్ తో ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సీరియస్ లుక్స్:
పోస్టర్ చూస్తుంటే.. అదేదో సీరియస్ సన్నివేశానికి సంబంధించిన సీన్ లాగే ఉంది. కుష్బూ, పవన్ ఇద్దరూ ఎదురుగా నిలుచున్న వ్యక్తి వైపు తీక్షణంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఎడిట్ చేసిన ఫోటోలోనూ చిరు సీరియస్ లుక్స్ లో కనిపించే ఫోటోను తీసుకొచ్చి కుష్బూ స్థానంలో కూర్చొబెట్టేశారు.

అభిమానులకు పూనకం:
పవన్ అభిమానులకు ఈరోజంతా పూనకమే అని చెప్పాలి. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా థియేటర్ల వద్ద చేరి 'అజ్ఞాతవాసి'కి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతున్నారు. ఈ సినిమా రికార్డులు తిరగరాయడం పక్కా అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీంతో త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ మరోసారి అభిమానులను అలరించిందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











