»   » మా హీరో జోలికి వస్తే మీ సెక్స్ క్లిప్స్ తీస్తాం: హీరో దిలీప్ అభిమానుల పైత్యం

మా హీరో జోలికి వస్తే మీ సెక్స్ క్లిప్స్ తీస్తాం: హీరో దిలీప్ అభిమానుల పైత్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోల మీద అభిమానం మరీ వెర్రి అభిమానం గా మారి చాలా కాలం అయ్యింది ఇక ఇప్పుడు మరింత ముదుకు అడుగు వేసి మీ సెక్స్ వీడియోలు కూదా తీస్తాం అనే వరకూ వెళ్ళింది. దీన్ని ఏరకమైన అభిమానం అనాలో అర్థం కావటం లేదు. సినీ హీరోలమీద అభిమానం ఒకప్పుడు హీరో పుట్టిన రోజులకీ, కొత్త సినిమా రెలీజ్ లకీ అన్నదానాలూ, పాలాభిషేకాలూ వంటి పనులకి పరిమితమయ్యేది, ఆ తర్వాత జంతు బలులూ, వేరే హీరోలమీద కోపం తో వాళ్ళ అభిమానులమీద భౌతిక దాడులవరకూ వచ్చింది... ఇప్పుడు ఏకంగా మా హీరో తప్పు చేసినా సరే అతన్ని ఎవరైనా ఏమైనా అంటే లైంగిక దాడులకు పాల్పడతాం, సెక్స్ వీడియోలు తీసి నెట్ లో పెడతాం అంటూ బెదిరిస్తున్నారు.. మళయాల అభిమానులు.

 నటిపై లైంగిక దాడి చేయించి

నటిపై లైంగిక దాడి చేయించి

ఇంతకీ విషయం ఏమిటంటే... వ్యక్తి గత కక్షతో ఒక నటిపై లైంగిక దాడి చేయించి, ఆమెను వివస్త్రను చేసి , వీడియోలు తీసి.. ఆమెపై ప్రతీకారం తీర్చుకొన్నాడు, అనేది మళయాల పీపుల్స్ స్టార్ దిలీప్ పై నమోదైన అభియోగం. అందుకు సంబంధించి పోలీసులు సాక్ష్యాలు కూడా సంపాదించి.. మూడు నెలల పాటు దిలీప్ ను జైల్లో పెట్టారు.

దిలీప్ ఫ్యాన్స్ హద్దు మీరుతున్నారు

దిలీప్ ఫ్యాన్స్ హద్దు మీరుతున్నారు

కేసు ఇంకా విచారణలో ఉంది. అయితే ఈ మధ్యనే దిలీప్ బెయిల్ సంపాదించి బయటకు వచ్చాడు. ఇందులో నిజానిజాలు తేలి తీర్పు ఇంకా వెలువడలేదు గానీ బయట, సోషల్ మీడియాలో దిలీప్ ఫ్యాన్స్ మాత్రం హద్దు మీరుతున్నారు. ఎవ్వరు భాదిత నటి పక్షాన మాట్లాడినా, దిలీప్ చేసిన పనిని తప్పు పడుతూ పోస్టులు పెట్టినా, అసభ్య పదజాలంతో కమెంట్లలో విరుచుపడుతున్నారు.

లైంగిక దాడులు

లైంగిక దాడులు

చివరకు ఎంత వరకూ వచ్చారంటే, తమ అభిమాన హీరోతో ఎవరైనా పెట్టుకుంటే అతను నటిపై చేసినట్టే లైంగిక దాడులు చేసి మరీ వాళ్ల సెక్స్ క్లిప్స్ అందరి మొబైల్స్ లోకి పంపుతాం జాగ్రత్త. అని హెచ్చరించేటంతటి వరకూ వచ్చారు. ఈ మేరకు దిలీప్ అభిమానుల ఫ్యాన్స్ పేజీల్లో ఇలాంటి పోస్టులు దర్శనం ఇచ్చాయి. దిలీప్ కు వ్యతిరేకంగా, నటికి మద్దతుగా ఉన్న వాళ్లందరికీ అభిమానులు ఈ హెచ్చరిక జారీ చేశారు.

మీ సెక్స్ క్లిప్స్ కూడా

మీ సెక్స్ క్లిప్స్ కూడా

తేడా వస్తే.. ఆ నటికి పట్టిన గతే మీకూ పడుతుంది, మీ సెక్స్ క్లిప్స్ కూడా ఇంటర్నెట్ లోకి వస్తాయని.. వీళ్లు నటికి మద్దతుగా నిలుస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. అభిమానుల ఆగడాలు మరీ హద్దుమీరుతున్నాయి. సినీ అభిమాన పైత్యంలో కొట్టుకుపోతూ వీళ్లు ఇలా వ్యవహరిస్తున్నారు.

కేరళలో నిరసన

కేరళలో నిరసన

దిలీప్ ఫ్యాన్స్ పెట్టిన ఈ పోస్టులపై కేరళలో నిరసన వ్యక్తం అవుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం దేన్నీ లెక్కచేసేటట్టుగా లేరు. మరిన్ని పోస్టులతో బెదిరింపు పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారట. అభిమానం నటనమీదా, నటుడిమీద ఉండవచ్చుకానీ అతను తప్పుచేసినా సమర్థించటం ఒక ఎత్తయితే, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళమీద ఆ హీరో పద్దతిలోనే దాడులకు పాల్పడతాం అంటూ హెచ్చరించటం మాత్రం ధారుణమే. ఎప్పటికి ఈ జనాలు ఈ వెర్రి నుంచి బయట పడతారో.

English summary
If Dileepettan wants, all you feminist women will be reduced to sex clips on our phones," a Facebook FAN Page posted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu