చేయి పట్టుకుని మరీ సమంతకు ప్రపోజ్ చేసిన ఫ్యాన్.. అమ్మాయో అబ్బాయో పుట్టాలంటూ కేకలు..!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో అక్కినేని వారి కోడలు సమంత ఒకరు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈమె.. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకుంది. అదే సమయంలో టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది. దీంతో దక్షిణాదిలో సమంత పేరు మారుమ్రోగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె క్రేజ్‌ను నిరూపించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. తాజాగా ఓ అభిమాని ఆమె చేయి పట్టుకుని మరీ ప్రపోజ్ చేయడం విశేషం. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఎక్కడ చూసినా సమంతే కనిపిస్తోంది

ఎక్కడ చూసినా సమంతే కనిపిస్తోంది


తెలుగులో సమంత కొన్నేళ్లుగా హవా కొనసాగిస్తోంది. ఈ మధ్య ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవడంతో.. సామ్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అదే తరహాలో కోలీవుడ్‌లోనూ ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. దాదాపు ఇక్కడ అందరు స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు.. అక్కడ కూడా చాలా మంది సినిమాలో యాక్ట్ చేసింది.

ఆ పాత్రలో కూడా అదరగొట్టేసింది

ఆ పాత్రలో కూడా అదరగొట్టేసింది

సమంత తాజాగా నటించిన చిత్రం ‘జాను'. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96'కు రీమేక్‌గా వచ్చిందీ మూవీ. దాన్ని రూపొందించిన దర్శకుడే దీన్ని కూడా తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో జాను పాత్రలో సమంత అదరగొట్టేసింది. దీంతో ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఎన్నో అంచనాలతో వచ్చింది.. ఇలా అయింది

ఎన్నో అంచనాలతో వచ్చింది.. ఇలా అయింది

తమిళంలో సూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో అవార్డులను కైవశం చేసుకుంది ‘96' మూవీ. దాని ఫీల్ పోకూడదనే కారణంతో మాతృక దర్శకుడినే తీసుకొచ్చారు దిల్ రాజు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, తమిళంలో మాదిరిగా ఇక్కడ ఫలితాన్ని రాబట్టలేకపోతోంది ‘జాను'. ఈ సినిమాకు ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, మల్టీఫ్లెక్స్‌ల్లో మాత్రం అదరగొడుతోంది.

చేయి పట్టుకుని సమంతకు ప్రపోజ్ చేసిన ఫ్యాన్

చేయి పట్టుకుని సమంతకు ప్రపోజ్ చేసిన ఫ్యాన్

సమంత, దిల్ రాజు, శర్వానంద్ సహా ‘జాను' చిత్ర యూనిట్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది. స్వామి వారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన సమంతకు ఓ అభిమాని అక్కా అంటూ సంబోధిస్తూ ‘ఐ లవ్ యూ' అన్నాడు. దీంతో అతడి వైపు చూస్తూ నవ్విన సామ్.. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. దీంతో మళ్లీ మళ్లీ ‘ఐ లవ్ యూ' చెప్పాడు.

అమ్మాయో అబ్బాయో పుట్టాలంటూ కేకలు..!

అమ్మాయో అబ్బాయో పుట్టాలంటూ కేకలు..!


అదే సమయంలో పక్కనే ఉన్న మరికొందరు కూడా ‘ఐ లవ్ యూ సామ్' అంటూ కేకలు వేశారు. అంతేకాదు, ‘ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో త్వరలోనే మీకు అమ్మాయో అబ్బాయో పుట్టాలి' అంటూ గట్టిగా అరిచారు. దీంతో సమంతతో పాటు చిత్ర యూనిట్ మొత్తం నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Recommended Video

Samantha Emotional Speech At Jaanu Success Meet | Sharwanand | Samantha
సమంతకు మిగిలింది అదొక్కటి మాత్రమే

సమంతకు మిగిలింది అదొక్కటి మాత్రమే

కొద్ది రోజులుగా సమంత సినిమాలను పెద్దగా ఒప్పుకోవడం లేదు. ‘జాను' కూడా రిలీజ్ అవడంతో ఆమె సంతకం చేసిన సినిమాలేవీ లేవు. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్'కు కొనసాగింపుగా వస్తున్న వెబ్ సిరీస్‌లో మాత్రం ఆమె నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌లో సామ్.. నెగెటివ్ రోల్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించిన సంగతి విధితమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X