Jr NTR: ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం.. ఆ కుర్రాడు చేసిన పనితో కలకలం.. ఇక చేయను అంటూ తారక్ సీరియస్
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ స్టార్ అనే పదానికి సరైన అర్థం చెబుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన 'దాస్ కా దమ్కీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా అతడికి ఓ అభిమాని షాక్ ఇచ్చాడు. మరోవైపు తారక్ ఫ్యాన్స్‌పై సీరియస్ అయ్యాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!

దాస్ కా దమ్కీ అంటోన్న విశ్వక్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమానే 'దాస్ కా ధమ్కీ'. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న 'దాస్ కా ధమ్కీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక ఆడిటోరియంలో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. దీనికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ ఫంక్షన్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ హాజరయ్యారు.

ఎన్టీఆర్ స్పీచ్.. ప్రశంసల వర్షం
విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి లాగే తనదైన స్పీచ్ ఆకట్టుకున్నాడు. అంతేకాదు, హీరో విశ్వక్ సేన్ గురించి, అతడి సినిమాల ఎంపిక గురించి, తమ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఎన్టీఆర్ చాలా బాగా మాట్లాడాడు. ఆ సమయంలో విశ్వక్ ఎంతగానో ఎమోషనల్ అయిపోయాడు.

నాకంటే ఎక్కువగా వాగుతాడు
'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'విశ్వక్ మాట్లాడినట్లు మైక్‌లో నేనెప్పటికీ మాట్లాడలేను. అతనొక ఎనర్జీ బాల్. మామూలుగా మేం కూర్చుంటే నేనే ఎక్కువ వాగుతాను. కానీ, తను నా కంటే ఎక్కువ వాగుతాడు. అంటే నేను కూడా సైలెంట్ అయిపోయి విశ్వక్ మాటలు వినేంత స్టేజ్‌కు నన్ను తీసుకెళ్లాడంటే ఇమాజిన్ చేయండి' అని చెప్పుకొచ్చాడు.

అది నా రెస్పాన్సిబిలిటీ అని
ఎన్టీఆర్ కొనసాగిస్తూ.. 'విశ్వక్ సినిమా ఫంక్షన్‌కు రావడం ఎప్పటి నుంచో బాకీ. బాకీ కూడా కాదు నా రెస్పాన్సిబిలిటీ. నిజానికి నేను బాగా మూడ్ ఆఫ్ అయినపుడు చూసే చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. ఆ చిత్రంలో విశ్వక్, అభినవ్ నటనను అలా చూస్తూ ఉండిపోవచ్చు. ముఖ్యంగా విశ్వక్.. ఒక నటుడిగా కామెడీ చేయకుండానే ఆ సినిమాలో కామెడీ పండించాడు' అన్నాడు.

విశ్వక్‌ది పుర్వజన్మ సుకృతం
తర్వాత విశ్వక్ నటించిన సినిమాలు, అతడి ప్రవర్తన గురించి మాట్లాడిన ఎన్టీఆర్.. 'కెరీర్‌లో ఇలాంటి విషయాల్లో రియలైజ్ అవ్వడానికి నాకు చాలా టైమ్ పట్టింది. అందుకే మీకు గతంలో చెప్పినట్లు కాలర్ ఎగరేసే సినిమాలే చేస్తున్నా. ఏదేమైనా ఇంత ఎర్లీ ఏజ్‌లో బ్యాలన్స్‌డ్‌గా యాక్ట్ చేయడం చాలా కష్టం. అది విశ్వక్‌కు పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి' అని పేర్కొన్నాడు.

సినిమాలు చేయడం లేదని
చివర్లో చిత్ర యూనిట్ మొత్తానికి ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పిన సమయంలో కొందరు ఫ్యాన్స్ నెక్ట్స్ సినిమా గురించి కేకలు వేశారు. దీంతో అతడు 'నేను నెక్ట్స్ సినిమా చెయ్యట్లేదు. ఎన్నిసార్లు చెప్తారు. మొన్ననే చెప్పానుగా. మీరు ఇలాగే అడిగితే నెక్ట్స్ సినిమా చెయ్యట్లేదనే చెప్తా.. అపేస్తాను కూడా' అని సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత 'సినిమాలు చేయడం నేనెలా ఆపేస్తాను. నేను ఆపేస్తే మీరు ఊరుకుంటారా' అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం
'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు. అంతలోనే ఓ కుర్రాడు వచ్చి అతడిని పట్టుకుని గట్టిగా లాగేశాడు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం కనిపించింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అని అంతా కంగారు పడ్డారు. ఆ తర్వాత కూడా ఆ కుర్రాడితో ఎన్టీఆర్ ఫొటో తీసుకున్నాడు. మొత్తానికి కింద పడిపోయే ప్రమాదం నుంచి తారక్ తప్పించుకున్నాడు.


Click it and Unblock the Notifications











