హీరోయిన్ కోసం యువకుడి పాట్లు.. ఏకంగా 5 రోజుల పాటు అక్కడే! చివరకు ఆమెనే వచ్చి..

తమ తమ అభిమాన తారలను కలవాలని, వారితో ఫోటోలు దిగాలని ఆశ పడుతుంటారు అభిమానులు. ఎంత ఆశ పడినా అది అందరికీ వచ్చే అవకాశం కాదు. ఒకవేళ అవకాశం వచ్చినా అంత సులభం కాదు. హీరోయిన్ పూజా హెగ్డేను కలవడం కోసం ఇలాంటి విశ్వ ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. చివరకు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు.

ప్ర‌స్తుతం తెలుగులో స్టార్ హీరోల స‌ర‌స‌న నటిస్తూ సూపర్ ఫామ్‌లో ఉంది పూజా హెగ్డే. ఈమె అందం, అభినయం తెలుగు ప్రేక్షకులకు బాగా రుచించి అమితమైన అభిమానం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె క‌లవ‌డానికి భాస్క‌ర్‌రావు అనే అభిమాని ముంబై చేరుకున్నాడు. ఓ సెలెబ్రిటీని కలవడం అంటే అంత సులువుకాదు కాబట్టి పట్టు వదలని విక్రమార్కుడిలా ఏకంగా ఆమె కోసం 5 రోజుల పాటు ముంబై వీధుల్లో ఫుట్‌పాత్‌పై నిరీక్షించాడు.

Fan Waiting 5 days For Pooja hegde

చివ‌ర‌కు ఈ విష‌యం తెలుసుకున్న పూజాహెగ్డే ఆ వ్యక్తిని కలిసి కాసేపు మాట్లాడింది. ఆ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన పూజా.. ''ఐదు రోజులు నా కోసం వెయిట్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు. నా కోసం అభిమాని ఇలా క‌ష్ట‌ప‌డ‌టం బాధ‌గా అనిపించింది. నా కోసం వ‌చ్చిన అభిమాని ఇలా రోడ్ల‌పై ఉండ‌టం నాకు నచ్చదు. నేనెప్పుడూ ఇలా కోరుకోను. మీ అభిమానమే నా బ‌లం ల‌వ్యూ అంటూ బాధ‌ప‌డుతున్న ఎమోజీని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X