»   » పవన్ కళ్యాణ్-మహేష్ బాబు అభిమానుల...చెత్త ఫైట్!

పవన్ కళ్యాణ్-మహేష్ బాబు అభిమానుల...చెత్త ఫైట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ఈ నెల 20న భారీ అంచనాల మధ్య విడుదలై....బాక్సాఫీసు వద్ద బొల్తా పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా భారీగా వస్తాయని అంచనా వేసినా ఆ అంచనాలను అందుకోలేక పోయింది. నిరాశపరిచిన ఫలితాలు చూసి ట్రేడ్ పండిట్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఇపుడు ఈ సినిమా ఫలితాలు ఫ్యాన్ గ్రూఫుల మధ్య వాదనకుదారి తీసాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోల డిజాస్టర్ కలెక్షన్లు కంపెయిర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాతో పాటు, మహేష్ బాబు హీరోగా వచ్చిన 'బ్రహ్మోత్సవం' కూడా భారీగా ప్లాపులే. అయితే 'బ్రహ్మోత్సవం' కంటే సర్దార్ గబ్బర్ సింగ్ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు #UndisputedKingOfOpeningsPSPK అనే యాష్ ట్యాగుతో ట్విట్టర్లో ట్రెండింగ్ క్రియేట్ చేసారు.

FAN WARS Between Mahesh Babu And Pawan Kalyan Fans Gets Uglier!

దీంతో చిర్రెత్తిపోయిన మహేష్ బాబు అభిమానులు #DisasterStarOfDecadePSPK, #GayStarPawanKalyan అంటూ వార్ మొదలు పెట్టారు. దీంతో పవన్ అభిమానులు మరింత రెచ్చిపోయారు. #SaveBrahmotsavamBuyers, #SerialStarMaheshBabu, #Floputsavam మరియు #DisasterStarMaheshBabu లాంటి యాష్ ట్యాగ్ లతో రచ్చరచ్చ చేస్తున్నారు.

వాస్తవానికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో నటించడానికి తానే సిద్దమే అని ప్రకటించారు కూడా. అయితే వీరి మధ్య మంచి స్నేహం ఉన్నా.... వారి అభిమానులు మాత్రం అనవసర బేషజాలకు పోయి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. అభిమాలు చేస్తున్న ఈ పనిని చెత్త ఫైట్ గా పలువురు అభివర్ణిస్తున్నారు.

English summary
Mahesh Babu's Brahmotsavam, which released on 20 May, amidst high expectations, tanked heavily at the box office, failing to collect decent revenues even on its first day. It is in fact a huge shocker for the trade pundits. Apparently, this gave raise to a debate among fan clubs on the career biggest disasters of the top league stars. Needless to say, this led to a war of words between the fan groups, especially among Mahesh and Pawan fans, comparing the collections of both the heroes' disaster films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu