ఫ్యాన్సీ రేటుకు శంభో శంకర హిందీ రైట్స్.. జోష్‌లో షకలక శంకర్!
కమెడియన్ షకలక శంకర్ హీరోగా నటిస్తున్న శంభో శంకర చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనం రేపింది. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ హక్కులు రికార్డు స్థాయికి అమ్ముడుపోయినట్టు సమాచారం. శ్రీధర్ ఎన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వై రమణరెడ్డి, సురేష్ కొండేటి నిర్మాతలు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
శంభో శంకర్ చిత్ర హిందీ రైట్స్‌ను డిస్టిబ్యూటర్ ఆదిత్య పటియా రూ.55 లక్షలకు సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. అడ్వాన్సుగా రూ.45 లక్షలు చెల్లించినట్టు సమాచారం. చిన్న సినిమాకు భారీ రేటు దక్కడంతో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాలోని తొలి లిరికల్ వీడియో సాంగ్‌ను మే డే సందర్భంగా సెన్షేషనల్ డైరెక్టర్ వి. వి.వినాయక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.



Click it and Unblock the Notifications











