నయనతార సాంగ్ వలన అనిరుధ్‌పై తీవ్ర విమర్శలు, కారణం ఇదే!

Recommended Video

Kalyana Vayasu Song : Anirudh Ravichander Copycat Says Fans

సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ దక్షిణాదిలో ఓ సంచలనం అనే చెప్పొచ్చు. అనిరుద్ అందిస్తున్న సంగీతం యువతని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. తాజగా అనిరుద్ స్వరపరచిన కల్యాణ వయసు అనే సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. నయనతార నటిస్తున్న కొలమవు కోకిల చిత్రంలోనిది ఈ పాట. నటుడు యోగి బాబు పెర్ఫామెన్స్ తో ఈ సాంగ్ సోషల్ మీడియాని దున్నేస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 5 మిలియన్ల వ్యూస్ పొందిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజగా సాంగ్ విషయంలో అనిరుద్ విమర్శలు ఎదుర్కొనవలసి వస్తోంది.

అనిరుద్‌పై విమర్శలు

అనిరుద్‌పై విమర్శలు

కళ్యాణ్ వయసు అనే సాంగ్ విషయంలో అనిరుధ్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కాపీ చేశాడా

5 మిలియన్ వ్యూస్ తో సూపర్ హిట్ అయిన ఈ సాంగ్ పై అందరి దృష్టి పడడం సహజమే. ఈ సాంగ్ ని అనిరుద్ కాపీ చేశాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నన్ ఆల్బమ్ నుంచి వచ్చిన డోంట్ లై అనే సాంగ్ నుంచి ట్యూన్ ని అనిరుద్ కాపీ చేశాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

దాదాపు ఒకేలా

ఈ రెండు పాటలని వింటే ట్యూన్స్ దాదాపుగా ఒకేలా ఉన్నట్లు అనిపించకమానదు. అనిరుద్ ఈ సాంగ్ నుంచే కాపీ చేసాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాపీ చేసినందుకు థాంక్స్, దీని ఒరిజినల్ సాంగ్ అద్భుతంగా ఉంది అంటూ పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

కొలమవు కోకిల

కొలమవు కోకిల

నయనతార నటిస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X