బాలయ్య ఫ్యాన్స్ అరాచకం..డాకు మహారాజు కు పొట్టెలును బలి ఇచ్చి..
Daaku Maharaj: నందమూరి బాలకృష్ణ.. ఎవర్ని అనుకరించకుండా.. అనుసరించకుండా.. తనని తాను సానబెట్టుకొని హీరో నందమూరి బాలకృష్ణ. సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడిగా తెరపైకి వచ్చినా.. తనని తాను తన తండ్రికి ఏకలవ్య శిష్యుడిగా ప్రకటించుకోవడం ఆయన గొప్పతనం. తనకు తాను పోటీపడే సైనికుడు బాలకృష్ణ.. ఆయన స్టెప్పులేసినా.. తొడ కొట్టినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోగాల్సిందే. తన నట విశ్వరూపంతో ఎన్నో రికార్డుల బ్రేక్ చేశాడు. ఆరు పదుల వయసు దాటిన.. యంగ్ హీరోలకు సైతం పోటీపడుతూ.. దూసుకెళ్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ.
చరిత్ర రాయాలన్నాయనే.. ఆ చరిత్ర తిరగరాయాలన్న ఆయనే. ఇక బాలయ్య ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతి కానుకగా నేడు 'డాకు మహారాజ్' గ్రాండ్ గా విడుదలైంది. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద నందమూరి ఫ్యాన్స్ అరాచకం మామూలుగా లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లూక్కేయండి.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకూ మహారాజ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ( నేడు) గ్రాండ్ గా విడుదలైంది. బాలయ్య తన నటనతో విధ్వంసం సృష్టించడానికి సంక్రాంతి బరిలో నిలిచారు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే చాందినీ చౌదరి గెస్ట్ రోల్ నటించింది. ఇక బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్ లో బాలయ్యతో కలిసి మాస్ స్టెప్పులేసింది.
ఇక సినిమా ముందు విడుదలైన ట్రైలర్, టీజర్స్, పోస్టర్స్ కు ఊహించని రెస్సాన్స్ వచ్చింది. దీంతో బాలయ్య బాబు సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. బాలయ్య బాబు యాక్షన్, బాబీ విజన్, తమన్ మ్యూజిక్ అన్నీ కలిపి డాకు మహారాజును మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.అభిమానులు అంచనాలకు తగట్టుగా మూవీ తెరకెక్కించడంతో మూవీమేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన రివ్యూ ప్రకారం.. మరోసారి బాలయ్య బాబు హిట్ కొట్టాడనే చెప్పాలి.
ఇదిలాఉంటే.. ఇక బాలయ్య ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.. బాలయ్య బాబు పేరు చెబితేనే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఆయన డైలాగ్ చెప్పినా.. కన్నెర్ర చేసినా.. శివమెత్తుతారు. బాలయ్యను ఓ దేవుడు లాగా కొలుస్తారు అతని అభిమానులు. ఇక సంక్రాంతి కానుకగా బాలయ్య 'డాకు మహారాజ్' సినిమా రావడంతో నందమూరి అభిమానుల హంగామా మామూలుగా లేదు. థియేటర్లలో ఫ్యాన్స్ జాతర చేస్తున్నారు. తమ అభిమాన నటుడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని, దేవుళ్ళకు బలిచ్చినట్లు థియేటర్లలో పొట్టేలు బలిస్తున్నారు. కటౌట్లకు రక్తాభిషేకం చేస్తున్నారు. మరికొందరైతే బాలయ్య బ్రాండ్ మెన్షన్ హౌస్ తో అభిషేకం చేస్తున్నారు.
Sensitive Video:
— Daaku (@_muralie) January 11, 2025
Avoid harming animals in the name of movie celebrations. 🙏#DaakuMaharaaj pic.twitter.com/vAv8YpmPlD
ఇలా బాలయ్య మాస్ ఫాన్స్ అరాచకం సృష్టిస్తుంది. తమ అభిమానాన్ని వారికి నచ్చినట్లు చూపిస్తూ నందమూరి అభిమానులు హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాల కోసం మూగజీవులను బలి చేయడం ఏంటని జంతు ప్రేమికుడు ఆగ్రహం వ్యక్తం మరి కొందరు. బాలయ్య సినిమా అంటే మామూలుగా ఉంటుందా.. తలలు తెగాల్సిందే.. రక్తం ఏరులై పారాల్సిందే .. 'అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ డాకు మహారాజ్ పాజిటివ్ టాక్ తో ఫుల్ ఖుషి లో ఎంజాయ్ చేస్తున్నారు..


Click it and Unblock the Notifications











