హీరోలను కాదు... నన్ను చూడ్డానికే నా సిన్మాలకు వస్తారు...!?
సౌత్ ఇండియన్ ఫిలింస్ లో నటించడం చాలా ఆనందంగా వుందని బాలీవుడ్ లో కహానీలు చెబుతోంది సెక్సీ భామ నేహా ధూపియా. అప్పుడెప్పుడో రాజశేఖర్ తో ఓ సినిమాలో నటించిన నేహా ధూపియా, చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరెకెక్కుతోన్న 'పరిమవీర చక్ర" సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా, తమిళంలో ఓ సినిమా అంగీకరించాననీ, కన్నడలో ఓ సినిమా చర్చల దశలో వుందని నేహాధూపియా చెప్పుకొచ్చింది.
కాగ ప్రేక్షకులు మాత్రం నేహా ధూపియా ఎక్కడికో వెళ్లిపోయింది. బాలీవుడ్ సినీ పరిశ్రమ అంచుల దాకా వెళ్లిపోయింది. ప్రేక్షకులు తను నటించిన సినిమాలకు తనను చూసేందుకు మాత్రమే వస్తారు తప్ప హీరోల ఫైటింగులు, డ్యాన్సులకోసం రారని బడాయి పోతోంది. ఇంతకీ నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటని అడిగేలోపే...నా ఫిగర్ అంటే నా అభిమానులకు ఎంతో క్రేజ్ అని సెలవిచ్చింది. ఆ అందమైనా బాడీని చూసేందుకు తన అభిమానులు ఎన్నిసార్లైనా థియేటర్లకు వస్తూనే ఉంటారని పోజు కొడుతోంది.
అందుకేనేమో...తను ఏ నిర్మాత తలుపులు పదేపదే కొట్టనని తలబిరుసు వ్యాఖ్యలు చేస్తోంది. ఇపుడు బాలీవుడ్ సెక్సీయెస్ట్ నటితో ఓ సినిమా చేయాలంటే.. తప్పకుండా సదరు నిర్మాతలు తనను సంప్రదించాల్సిందేనని పొగరుబోతు సమాధానం చెపుతోంది. ఎంత అందగత్తె అయినప్పటికీ ఇంత పొగరా...? అని బాలీవుడ్ సినీజనం అంటున్నారట. అయితే వారి మాటలను ఖాతరు చేసే స్థితిలో నేహా ధూపియా ఉంటే కదా..


Click it and Unblock the Notifications











