twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేపాల్‌లో చిరంజీవి, ఇక్కడ దుమ్మురేపిన ఫ్యాన్స్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజవి కుటుంబ సభ్యులతో నేపాల్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి పశుపతి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో వైపు చిరంజీవి అభిమానులు ఇక్కడ దుమ్ము రేపారు. మెగా స్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్బంగా వివిధ ప్రాంతాల్లోని 25 వేల మందికిపైగా రక్తదానం చేసారు.

    ఈ రక్తదాన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అల్లు అరవింద్ ప్రారంభించారు. ఒక్క హైదరాబాద్‌లోనే వివిధ రక్తదాన శిబిరాలలో 2,365 మందికిపైగా అభిమానులు రక్తదానం చేసారు.

    చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఫిల్మ్ నగర్ శ్రీదాసాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష తమళపాకులతో చిరంజీవి పేరు మీద పూజా కార్యక్రమాలు జరిగాయి.

    స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

    అంజనా దేవి

    అంజనా దేవి


    ఈ విశేష పూజలో చిరంజీవి తల్లి అంజనాదేవి, నాగబాబు భార్య పద్మ, రాష్ట్ర చిరంజీవి యువత వ్యవస్థాపక అద్యక్షుడు రవణం స్వామినాయుడు, విశాఖ జిల్లా అధ్యక్షుడు ఏ.కొండల రావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏ.సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

    బర్త్ డే వేడుకలు

    బర్త్ డే వేడుకలు


    అనంతరం జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్, నిర్మాతలు శరత్ మరార్, డివివి దానయ్య తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి 59వ పుట్టినరోజు కావడంతో 59 కేజీల కేక్ తయారు చేయించారు.

    అభిమానులకు థాంక్స్

    అభిమానులకు థాంక్స్


    25వేల మందికి అభిమానులు రక్తదానం చేయడం చాలా విశేషం, ఫ్యాన్స్ చేస్తున్న రక్తదానాల ద్వారా రెండు లక్షల నలభై వేల మంది పేద ప్రజలకు ఉచితంగా రక్త సరఫరా చేయగలిగామని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి రక్తదానం చేయడానికి వచ్చిన అభిమానులను అభినందించారు. ప్రతి ఒక్క రక్త దాతకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపారు.

    150వ సినిమా గురించి..

    150వ సినిమా గురించి..


    150వ సినిమాను త్వరలో ప్రకటిస్తానని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని, రికార్డుల కోసం కాదని తెలిపారు.

    మొక్కలు నాటారు

    మొక్కలు నాటారు


    ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని నాగబాబు హైదరాబాద్ లోని మణికొండలో మొదటి మొక్క నాటి ప్రారంభించగా...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒకే రోజులో లక్షా రెండు వేల ఐదు వందల మొక్కలు నాటడం జరిగింది.

    సేవా కార్యక్రమాలు

    సేవా కార్యక్రమాలు


    20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా మొదటిసారిగా మొగల్తూరులో 10వేల మందికి అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి పారిశ్రామిక వేత్త రామతులసి, మాజీ ఎంఎల్ఏ జానకిరామ్ తదితరులు హాజరయ్యారు.

    వారం రోజుల నుండి

    వారం రోజుల నుండి


    చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఆయన జన్మదిన తేదీకంటే వారం రోజుల ముందు అంటే ఆగస్టు 15న విశాఖజిల్లా గాజువాకలో ప్రారంభమవగా, ఎక్కువ సేవా కార్యక్రమాలు విజయనగరం జిల్లా, నెల్లూరు జిల్లాల్లో జరిగినట్లు ఆ జిల్లా ప్రతినిధులు బి. సతీష్, చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

    English summary
    
 Tollywood young Actor Mega Power Star Ram Charan and successful producer Allu Aravind celebrated Mega Star Chiranjeevi 59th Birth Day in Chiranjeevi blood bank at Hyderabad. Ramcharan and Allu Aravind said that on this day 25,000 Chiru fans have donated blood in both the Telugu states Telangana and Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X