'బీస్ట్' తెచ్చిన తంటా.. సినిమా నచ్చలేదని థియేటర్ స్క్రీన్‌కు నిప్పు పెట్టిన ఫ్యాన్స్
ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా ఎట్టకేలకు బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చేసింది రెండు సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోవడంతో థియేటర్స్ వద్ద విజయ అభిమానులు విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

మిశ్రమ స్పందన
మాస్టర్ లాంటి అద్భుతమైన విజయం అందుకున్న తర్వాత హీరో విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్. డాక్టర్ లాంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బుధవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే సినిమాకి ఉదయం నుంచి కూడా మిశ్రమ స్పందన లభిస్తోంది.

నిప్పు పెట్టారా?
విజయ్ స్థాయికి తగ్గ సినిమా కాదని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఒక థియేటర్ లో స్క్రీన్ కు విజయ్ అభిమానులు నిప్పు పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన మధురైకి సంబంధించిన ఒక థియేటర్లో చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా అభిమానులు సినిమా నచ్చలేదు అని నిప్పు పెట్టారా? లేక వేసవి కాలం కావడంతో ఎండవేడిమికి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయా? అనేది తెలియాల్సి ఉంది.

ప్రచారం చేస్తున్నారా
అయితే సినిమా నచ్చలేదు అని అభిమానులు నిప్పు పెట్టారనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వీడియో చూసి నెటిజన్లు అయితే విజయ అభిమానులను తూర్పార పడుతున్నారు సినిమా నచ్చకపోతే థియేటర్ వదిలి వెళ్ళి పోవాలి కానీ థియేటర్ లకు నిప్పు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది నిజంగానే విజయ్ అభిమానులు తగలబెట్టారా? లేక అజిత్ అభిమానులకు విజయ్ అభిమానులకు పడదు కాబట్టి వాళ్లు ఇలా ప్రచారం చేస్తున్నారా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

ప్రచారం చేస్తున్నారా
ఇక మరో పక్క కోయంబత్తూర్ లోని ఒక థియేటర్ దగ్గర విజయ అభిమానులు పెద్ద రచ్చ చేశారు. కోయంబత్తూరులోని రోహిణి థియేటర్ లో సినిమా బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కానీ కొంతమంది అక్కడ టికెట్స్ అందకపోవడంతో గందరగోళం సృష్టించారు. వేల సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా థియేటర్ మీదకు దూసుకు వెళ్లి థియేటర్ మీద రాళ్లు రువ్వారు, అలాగే సైడ్ వాల్స్ మీద ఏర్పాటు చేసిన ఎల్ఇడి డిస్ప్లే సైతం ధ్వంసం చేశారు.

అద్దాలు పగిలిపోయి
సైన్యంలా విరుచుకుపడిన అభిమానులను థియేటర్ యాజమాన్యం కట్టడి చేయలేకపోయింది. అయితే సినిమా విడుదల సందర్భంగా చాలా చోట్ల కోలాహల వాతావరణం కనిపించింది. థియేటర్లో కుర్చీల పై డ్యాన్సులు వేయడంతో కొన్నిచోట్ల కుర్చీలు విరిగిపోయిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే మరికొన్ని థియేటర్ల వద్ద ఒక్కసారిగా అభిమానులు పోటెత్తడంతో ఎంట్రన్స్ లో ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఇలాంటి చర్యలు జరుగుతాయని RRR విడుదల చేసిన థియేటర్లలో కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.


Click it and Unblock the Notifications











