రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్, నిర్మాత రక్తదానం (ఫోటోస్)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద శుక్రవారం ఘనంగా జరిగాయి. మెగాబ్రదర్ నాగబాబు, మెగా బావమరిది అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రక్తదానం చేసారు. గణేష్ తో పాటు పలువురు అభిమానులు బ్లడ్ డొనేట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రామ్ చరణ్ మరిన్ని వినోదాత్మక చిత్రాలు తీస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేయాలని ఆకాంక్షించారు.
పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సులబ్రేషన్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద శుక్రవారం అభిమానుల సమక్షంలో జరిగాయి.

నాగబాబు, అరవింద్
మెగా బ్రదర్ నాగబాబు, మెగా బావరమరిది అల్లు అరవింద్ సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

బండ్ల గణేష్
రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో మాట్లాడుతున్న బండ్ల గణేష్.

రక్తదానం
చరణ్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేస్తున్న నిర్మాత బండ్ల గణేష్.

ఫ్యాన్స్
గణేష్ తో పాటు పలువురు అభిమానులు బ్లడ్ డొనేట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.


Click it and Unblock the Notifications











