వరంగల్ లో చిరు పార్టీ హంగామా!!
ఆంధ్రలో మంగళవారంనాడే చిరంజీవి అభిమానులు పండుగ చేసుకుంటే తెలంగాణాలో బుధవారంనాటికి కానీ ఊపందుకోలేదు. తెలంగాణాకు రాజధాని వంటి వరంగల్ లో అభిమానులు బుధవారం సంబరాలు చేసుకున్నారు. చిరంజీవి తొందరగా పార్టీ పెట్టాలని వరంగల్ లో చిరంజీవి అభిమానులు ర్యాలీ తీశారు. చిరంజీవి రాజకీయాలలోకి రావాలని, వచ్చి తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని వారు ఈ సందర్భంగా నినాదాలు ఇస్తూ అన్నారు. బాణాసంచా భారీ ఎత్తున కాల్చారు. నానా హంగామా చేశారు.


Click it and Unblock the Notifications











