ఇంటి ముందు ఫ్యాన్స్ రచ్చ, సైగలతోనే కనుక్కున్న చెర్రీ: అంతా రంగస్థలం ఎఫెక్ట్..
Recommended Video

పక్కా పల్లెటూరి పోరగాడు.. అందులోనూ మస్తు చలాకీ. ఊళ్లో వాళ్లందరికీ చేదోడు వాదోడుగా ఉండే తనం.. అన్నీ కలగలిపితే రంగస్థలంలో రాంచరణ్ క్యారెక్టర్. తాజాగా విడుదలైన రంగస్థలం టీజర్‌ను చూస్తే ఇదే అర్థమవుతోంది. మొత్తంగా మెగా అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ విడుదలైన ఈ టీజర్ వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ రాంచరణ్ ఇంటి ఎదుట సైతం టపాసులతో పండుగ చేసుకున్నారు.

చెర్రీ ఇంటి ముందు హంగామా:
రాంచరణ్ రంగస్థలం టీజర్ విడుదలైందో లేదో క్షణాల్లో వైరల్ గా మారింది. టీజర్ అద్భుతంగా ఉందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సంతోషాన్ని చెర్రీతోనూ పంచుకోవాలనుకున్నారేమో.. ఆయన ఇంటి ముందు కూడా టపాసులు పేల్చారు.
ఉపాసన ట్వీట్:
చెర్రీ ఫ్యాన్స్ సంబరాలను ఆయన సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'మా ఇంటి ముందు అభిమానులు ఇలా టపాసులు పేల్చారు. మీ అదరాభిమానాలకు ధన్యవాదాలు.' అని ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు.
ఫ్యాన్స్‌కు చెర్రీ సైగలు:
చెర్రీ ఇంటిముందు టపాసులు కాలుస్తున్న సమయంలో.. బాల్కనీ విండో నుంచి ఆయన అభిమానులకు సైగలు చేశారు. టీజర్ ఎలా ఉందంటూ వారిని కనుక్కొన్నారు. చాలా బాగుందంటూ అభిమానులు కేకలు పెట్టడంతో వారందరికీ దన్యవాదాలు చెప్పి లోపలికి వెళ్లిపోయారు.

ట్రెండింగ్-1:
ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో రంగస్థలం టీజర్ టాప్-1గా ఉండటం విశేషం. రంగస్థలంలో తూర్పు గోదావరి యాసలో చెర్రీ చెప్పిన డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే నటనపరంగా దర్శకుడు సుకుమార్ రాంచరణ్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో చెర్రీ ఇరగదీసి ఉంటాడంటున్నారు.

డైలాగ్ సూపర్బ్..:
'నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు... అందరికీ సౌండ్ వినబడిద్దండి. కానీ నాకు మాత్రం సౌండ్ కనపడిద్దండి. అందుకే నన్ను సౌండ్ ఇంజినీర్ అంటారండి' అంటూ చెర్రీ చెప్పిన డైలాగ్ ఇప్పుడు అభిమానుల నోళ్లలో నానుతోంది.

తదుపరి సినిమా బోయపాటితో:
రాంచరణ్-సుకుమార్ రంగస్థలం షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాంచరణ్ బోయపాటితో ఓ చిత్రం కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో కైరా అద్వానీ చెర్రీతో జత కట్టబోతోంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ చిత్రంలోనూ చరణ్ నటించనున్నారు. ఇందులో చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











