twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ రష్మి లుక్ చూసి ఉలిక్కిపడ్డ ఫ్యాన్స్, టీనేజ్‌లో ఆమె నిజస్వరూపం ఇదేనట!

    |

    తెలుగులో బాగా పాపులర్ అయిన యాంకర్లలో టాప్ లిస్టులో ఉండే పేరు రష్మి గౌతమ్. చలాకీగా యాంకరింగ్ చేయడం మాత్రమే కాదు, తన గ్లామరస్ లుక్‌తో, సెక్సీ యాటిట్యూడ్‌తో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ లాంటి కామెడీ షోలకు గ్లామర్ సొగబులు అద్దడం ద్వారా ఆమె సూపర్ పాపులర్ అయ్యారు.

    ఆ మధ్య గుంటూరు టాకీస్ చిత్రంలో రష్మి చేసిన అందాల రచ్చ అంతా ఇంతా కాదు. బికినీలు, ముద్దు సీన్లు, బెడ్రూం రొమాంటిక్ సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ మూవీ తర్వాత ఆమెకు అభిమానుల ఫాలోయింగ్‌తో పాటు సినిమా అవకాశాలు బాగా పెరిగాయి.

    అలా చూసిన రష్మిని ఇలా చూసి షాకవుతున్న ఫ్యాన్స్

    అలా చూసిన రష్మిని ఇలా చూసి షాకవుతున్న ఫ్యాన్స్

    రష్మి పేరు చెప్పగానే అభిమానుల మనసులో ముందుగా సెక్సీ ఫిగర్ సాక్షాత్కరిస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ యాంకర్ పిక్ ఒకటి ఫ్యాన్స్ ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా ఆమె గద్దముక్కు చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

    టీనేజ్‌లో నా లుక్ ఇలాగే ఉండేది అంటూ...

    ఓ యాప్ ఉపయోగించి రష్మి అభిమాని ఒకరు ఆమె లుక్ ఇలా మార్చేశారు. జస్ట్ ఫన్ కోసమే ఇలా చేశాను అంటూ పేర్కొన్నారు. దీనిపై రష్మి వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ పిక్ చాలా అందంగా ఉంది. టీనేజీలో ఉన్నపుడు నేను ఇలానే ఉండేదాన్ని, కళ్ల జోడు తప్ప సేమ్ ఇలానే ఉండేది నా రూపం అంటూ ట్వీట్ చేశారు.

    అబ్బాయి రష్మి అంటూ ఫన్నీ కామెంట్స్

    అబ్బాయి రష్మి అంటూ ఫన్నీ కామెంట్స్

    రష్మి ట్వీట్ మీద ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. మీ టీనేజీ ఫోటోలను మాతో షేర్ చేసుకోవాలని కొందరు, అప్పటికీ, ఇప్పటికీ మీలో చాలా మార్పు వచ్చిందని మరికొందరు కామెంట్స్ చేశారు. కొందరు చిలిపి అభిమానులు అబ్బాయి రష్మి అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.

    వారి కామెంట్లను లైట్ తీసుకున్న రష్మి

    వారి కామెంట్లను లైట్ తీసుకున్న రష్మి

    అభిమానులు తనపై చేస్తున్న ఫన్నీ కామెంట్స్‌ను రష్మి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా చేసే వ్యాఖ్యలు కాబట్టి ఆమె కూడా సరదాగానే తీసుకుంటున్నారు. ఎవరైనా తనపై నెగెటివ్ కామెంట్స్ చేస్తే మాత్రం రష్మి బిహేవియర్ మరోలా ఉంటుంది.

    English summary
    Fans changed Rashmi look as funny by the mobile app "This is so adorable and this is how I looked when I was in my teens minus the specs but the rest is ditto #ThankYou, This is damn sweet." Rashmi Gautam tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X