'పంజా' టిక్కెట్ల కోసం తన్నుకున్న అభిమానులు
పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటించిన 'పంజా' సినిమా శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్రం మొత్తం పంజా ఫీవర్ పట్టుకుంది. తమ అభిమాన హీరో సినిమా తొలి రోజు చూడటానికి అభిమానులు పోటీ పడుతున్నారు. టిక్కెట్ల కోసం ఆయా థియేటర్ల వద్ద భారీగా బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఘర్షణలు, కొట్లాటలు కూడా జరిగాయి.
కృష్ణా జిల్లా న్యూజివీడులోని తిరుమల థియేటర్ వద్ద 'పంజా' టిక్కెట్ల కోసం అభిమానులు ఘర్షణపడ్డారు. ఈ సందర్భంగా ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేశారు. థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాయ పడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషయమంగా ఉంది. మరికొన్ని చోట్ల బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతుండటంపై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
pawan kalyan panja sarah jane dias anjali lavania vishnuvardhan పవన్ కళ్యాణ్ పంజా సారాజెన్ దియాస్ అంజలి లావానియా విష్ణువర్థన్


Click it and Unblock the Notifications