పీక్ రేంజిలో పవన్ కళ్యాణ్ మేనియా (ఫోటోస్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినీ స్టార్. సాధారణంగా అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం ఫాన్స్ కాదు భక్తులుంటారు అని అంటుంటారు. ఆ మధ్య ఓ అభిమాని పెళ్లి కార్డుపై దేవుడి ఫోటోకు బదులు పవన్ కళ్యాణ్ ఫోటో వేయించుకోవడమే ఇందుకు నిదర్శనం.
పవన్ కళ్యాణ్ మేనియా అభిమానుల్లో పీక్ రేంజిలో ఉందడానికి మరిన్ని సంఘటనల సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఓ అభిమాని తమ పెళ్లి బేనర్లో సర్దార్ గబ్బర్ సింగ్ ఫోటో పెట్టేసాడు. పెళ్లి వేడుకలో అందరూ పవన్ కళ్యాణ్ మాదిరి ఎరుపు రంగు ముసుగుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
కొందరు అభిమానులు తమ ఆటోలపై సర్దార్ గబ్బర్ సింగ్ ఫోటోలు.... మరికొందరు తమ సెల్ ఫోన్లపై సర్దార్ గబ్బర్ సింగ్ పోస్టర్లు వేయించుకున్నారు. దీన్ని బట్టి అభిమానుల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్...

పెళ్లి వేడుకలో..
పెళ్లి వేడుకలో సర్దార్ గబ్బర్ సింగ్ పోస్టర్లు, పవన్ తరహాలో ముసుగుతో ఫోటోలకు ఫోజులు

ఆటోపై..
ఓ అభిమాని తన ఆటోపై సర్దార్ గబ్బర్ సింగ్ పోస్టర్ వేయించుకున్న దృశ్యం...

సర్దార్ గబ్బర్ సింగ్ డిజైన్
సెల్ ఫోన్ మీద సర్దార్ గబ్బర్ సింగ్ డిజైన్

డ్డింగ్ కార్డుపై..
వెడ్డింగ్ కార్డు మీద పవన్ కళ్యాణ్ ఫోటో వేయించుకున్న అభిమాని.


Click it and Unblock the Notifications