Prabhas: భార్య పిల్లలతో ప్రభాస్ ఫోటోస్ వైరల్... ఎవర్రా ఇది చేసింది?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటినుంచో వార్తలు గుప్పుమంటున్నవిషయం తెలిసిందే. ఇక ఈ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని ఫ్యాన్స్ అయితే తెగ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ భార్య పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ఆ తర్వాత బహుబలి 2తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్.. సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయినా ప్రభాస్ రేంజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు ఆయన ఆశలన్నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాపైనే ఉన్నాయి.

ఇక సలార్ సినిమాను రెండు పార్టులుగా నిర్మిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సీరిస్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను విజయ్ కిరగందర్.. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఆ విషయం పక్కన పెడితే... ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వయసు 44 దాటినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం.. ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రభాస్ అనుష్క మధ్య ఏదో ఉందంటూ గత కొంతకాలంగా గాసిప్స్ వినిపిస్తునే ఉన్నాయి. తాజాగా కొంత మంది ఫ్యాన్స్ ప్రభాస్ అనుష్కకు పెళ్లి చేసేశారు. కానీ రియల్ లైఫ్ లో కాదు.
మొదటి నుంచి అనుష్క, ప్రభాస్ మంచి స్నేహితులు. ప్రభాస్ పెళ్లి అనుష్కతో జరిగితే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన బిల్లా, మిర్చి చిత్రాలలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. ఆన్ స్క్రీన్ జంటకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉంటారు. వీరిద్దరూ రియల్ లైఫ్ లో జోడి అయితే బాగుంటుందని కామెంట్స్ పెడుతూ ట్రెండింగ్ చేస్తుంటారు ఫ్యాన్స్.
ప్రభాస్ పెళ్లి గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఏఐ సాయంతో ఓ ఫ్యామిలీని క్రియేట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ప్రభాస్ భార్య, పిల్లల ఫోటోస్ వైరలవుతున్నాయి. అవి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్, అనుష్కకు పెళ్లి జరిగినట్లుగా వీరికి ఒక పాప, బాబు ఉన్నట్లుగా ఫోటోస్ డిజైన్ చేశారు ఫ్యాన్స్.. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ #Pranushka అంటూ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











