రవితేజ - థమన్.. కాస్త బ్రేకులు వేయండి బాబు, ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు!
మాస్ మహారాజా రవితేజ హిట్టు చూసి చాలా కాలమవుతోంది. రాజా ది గ్రేట్ తరువాత ఇంతవరకు ఒక్క సక్సెస్ కూడా చూడలేదు. హ్యాట్రిక్ డిజాస్టర్స్ లిస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఫామ్ లో లేని సీనియర్ హీరోలలో రవితేజ ఒక్కడే టాప్ లో ఉన్నాడు. ఇప్పటికే సగానికి పైగా మార్కెట్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే మాస్ రాజా అభిమానులను అన్నిటికంటే ఎక్కువగా ఒక విషయం బాగా ఇబ్బంది పెడుతోందట.
అదేమిటంటే ఒకప్పుడు హిట్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ - థమన్ కాంబినేషన్ అస్సలు సెట్టవ్వడం లేదు. థమన్ రవితేజ సినిమాలకు సంగీతం అందించడానికి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంటాడు. కిక్ సినిమాతో మొదటి అవకాశం ఇప్పించింది రవితేజనే.

ఆ తరువాత వీరి కాంబినేషన్ లో డజను సినిమాలు వచ్చాయి. కానీ అందులో సక్సెస్ ల కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. సినిమా సక్సెస్ కాకపోయినా కొన్ని సంధర్భాల్లో మ్యూజిక్ బాగానే క్లిక్కవుతోంది.
కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ మాత్రం అవ్వడం లేదు. ముఖ్యంగా అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలు ఊహించని రిజల్ట్ ని అందుకున్నాయి. దీంతో ఈసారైనా ఆ చెత్త రికార్డులకు బ్రేకులు వేయాలని అభిమానుకు కోరుకుంటున్నారు. నెక్స్ట్ థమన్ రవితేజ క్రాక్ సినిమాతో పాటు మరొక సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఆ సినిమాలతో ఈసారైనా మంచి సక్సెస్ లు అందుకుంటే బావుంటుందని ఆడియెన్స్ సోషల్ మిడియా ద్వారా వారి ఆవేదనను తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











