కరెంటు తీగ: ఫ్యాన్స్ చూపంతా సన్నీ లియోన్ వైపే...
హైదరాబాద్: మంచు మనోజ్, రాకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సన్నీ లియోన్ ప్రధాన పాత్ర ధారులుగా జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాతగా 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘కరెంటు తీగ'. ఈ చిత్రం రేపు(అక్టోబర్ 31)న గ్రాండ్‌గా విడుదలవుతోంది.
సినిమాకు హీరో మంచు మనోజే అయినప్పటికీ....ఈసినిమాలో మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తుండటం, ఆమెపై స్పెషల్ సాంగ్ ఉండటం, ఈ సాంగ్ చాలా హాట్‌గా ఉంటుందని ప్రాచారం చేయడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. సన్నీ లియోన్ తెలుగులో తొలిసారి నటిస్తుండటంతో ఆమె పెర్ఫార్మెన్ ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'A' సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్ర నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ.....సన్నీ లియోన్ స్పెషల్ సాంగు వల్లే సినిమాకు 'A' సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు. అలా అని సినిమాలో ఆమె వల్గర్ పాత్ర ఏమీ చేయడం లేదు. సంప్రదాయ బద్దంగా టీచర్ పాత్ర పోషిస్తోంది. సాంగులో మాత్రం కాస్ల గ్లామరస్‌గా కనిపిస్తుందని తెలిపారు.
సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:కిశోర్ తిరుమల, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి, నిర్మాత:విష్ణు మంచు, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.


Click it and Unblock the Notifications











