ప్రత్యేక ఖాతా: పవన్ కళ్యాణ్ నిర్ణయం ఫ్యాన్స్‌కు తెగనచ్చేసింది!

By Bojja Kumar

పవన్ కళ్యాణ్ 2014లో ట్విట్టర్ ఖాతా ప్రారంభించినపుడు అభిమానులు తెగ సంబర పడిపోయారు. ఇక నుండి తమ అభిమాన హీరో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటారని, తన సినిమాలకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు తమతో పంచుకుంటారని ఆశ పడ్డారు.

అయితే పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేవలం రాజకీయ పరమైన అంశాల గురించి మాత్రమే ప్రస్తావిస్తుండటంతో సినీ అభిమానులు కాస్త నిరాశ పడ్డారని చెప్పక తప్పదు. ఈ విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ తన సినీ అభిమానుల కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు.

అభిమానులకు తెగ నచ్చేసింది

అభిమానులకు తెగ నచ్చేసింది

‘పికె క్రియేటివ్ వర్క్స్' పేరుతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. భారతీయ సినిమాకు మార్గదర్శకులైన శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే, శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడులకు సెల్యూట్ చెబుతూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఇందులో పవన్ కళ్యాణ్ రాజకీయ పరమైన అంశాలకు చోటు లేకుండా పూర్తిగా ఆయన నటించిన సినిమాలకు సంబంధించి విషయాలే పోస్టు చేస్తున్నారు.

అజ్ఞాతవాసికే తొలి అవకాశం

ఈ ఖాతా ద్వారా పోస్ట్ అయిన తొలి పోస్టర్ ‘అజ్ఞాతవాసి'. ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత చిత్రానికి సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా ప్రత్యేక ఖాతా తెరవడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం వారణాసిలో షూటింగ్

ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి' షూటింగ్ వారసణాసిలో జరుగుతోంది. షూటింగుకు సంబంధించిన ఫోటోలను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీమ్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు.

భారీగా ఫాలోయింగ్

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో 2.14 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా..... సినిమాల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యేవారి సంఖ్య 3 రోజుల్లోనే 60 వేలకు చేరువైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X