twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాల్లోకి వస్తున్న రజనీ: సూపర్ స్టార్ నిజాయితీకి ఫ్యాన్స్ సలాం....

    By Bojja Kumar
    |

    Recommended Video

    రజనీ ప్రభంజనం సృష్టిస్తారా ?

    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ తెరంగ్రేటంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అభిమానుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తానని, తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని రజనీకాంత్ స్పష్టం చేశారు.

     అదే నిజాయితీతో రాజకీయాల్లోకి

    అదే నిజాయితీతో రాజకీయాల్లోకి

    తమిళ వ్యక్తి కాక పోయినా, ప్రతి తమిళుడు అభిమానించి, ఆరాధించే స్థాయికి రజనీ రావడానికి కారణం.... కేవలం ఆయన సినిమాలు అనుకుంటే పొరపాటే. రజనీకాంత్ వ్యక్తిత్వం, సేవాగుణం, మంచితనం, నిజాయితీ ఆయన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇపుడు అదే నిజయితీతో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

     తనను ఆదరించిన ప్రజల కోసమే

    తనను ఆదరించిన ప్రజల కోసమే

    రజనీకాంత్ ముందు నుండీ రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే తమిళనాడులో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటం, ప్రజలు మరింత కష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో.... తనను ఆదరించి, అభిమానించి ఈ స్థాయికి తీసుకొచ్చిన తమిళ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు సూపర్ స్టార్.

     డబ్బు, పేరు కోసం కాదు

    డబ్బు, పేరు కోసం కాదు

    ప్రస్తుతం రాజకీయాలంటే కేవలం డబ్బు సంపాదించడం, పదవులు పొందడం,పేరు సంపాదించడం లాంటి స్వార్థపూరిత ఆలోచనలో నిండిపోయాయి. అయితే తనకు అవేవీ అవసరం లేదని, తనకు ఆల్రెడీ అవన్నీ ఉన్నాయని..... భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీకాంత్ తెలిపారు.

     దోపీడీ ఆగిపోవాలి

    దోపీడీ ఆగిపోవాలి

    ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ప్రజలను దోచుకునే విధంగా ఉన్నాయని, ప్రజాస్వామ్యం పేరిట కొందరు రాజకీయ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని పరిస్థితులను చూసి ఇతర రాష్ట్రాలు హేళన చేస్తున్నారని, ఈ సమయంలో తాను రాజకీయ నిర్ణయం తీసుకోకుంటే తప్పు చేసిన వాడిని అవుతానని రజనీకాంత్ అన్నారు.

     నిజం, పని, అభివృద్ధి

    నిజం, పని, అభివృద్ధి

    తాను ఏర్పాటు చేయబోయే పార్టీ నిజం, పని, అభివృద్ధి అనే మూడు మంత్రాలతో నడుస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఉంటే మూడేళ్లలోనే రాజీనామా చేస్తానని రజనీకాంత్ ప్రకటించారు.

    తమిళనాడు వ్యాప్తంగా ఫ్యాన్స్ సంబరాలు

    తమిళనాడు వ్యాప్తంగా ఫ్యాన్స్ సంబరాలు

    రజనీకాంత్ రాజకీయ ప్రకటనతో తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ రాష్ట్రానికి, తమ ప్రజలకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని ఆనందంలో ఉన్నారు.

    English summary
    Rajinikath enters politics, says he will form new party and contest all 234 seats of Tamil Nadu in the next assembly elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X