twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవి 900, ఇవి 43.... మహేష్ బాబుకు ఫ్యాన్స్ అదిరిపోయే గిఫ్ట్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Mahesh Babu 43rd Birthday Special : Fan Made Poster Goes Viral

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9న పుట్టిన రోజు జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు ఆయన కోసం వినూత్నమైన బహుమతి తయారు చేశారు. సూపర్ స్టార్‌కు ఇది 43వ పుట్టినరోజు కావడంతో 43 భాషల్లో విష్ చేస్తూ భారీ పోస్టర్ తయారు చేశారు. ఈ పోస్టర్లో మహేష్ బాబుకు సంబంధించిన 900 ఫోటోలు సైతం వాడటంతో పాటు, ఆయన ఇప్పటి వరకు నటించిన 24 చిత్రాల పోస్టర్లు సైతం పొందు పరిచారు. వినూత్నంగా ఉన్న ఈ గిఫ్ట్ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

    మహేష్ బాబుకు అభిమానుల గిఫ్ట్

    ఈ ఫోటోను మహేష్ బాబు ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాఫ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అభిమానులు తమ కామన్ డిపీగా పెట్టుని అభిమానాన్ని చాటు కుంటున్నారు. #SSMBBirthdayCDP2K18 యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

    పుట్టినరోజు వేడుకకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఏర్పాట్లు

    పుట్టినరోజు వేడుకకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఏర్పాట్లు

    గత పుట్టినరోజు వేడుకలను మించి పోయేలా ఈ సారి మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించాలని అభిమానులు డిసైడ్ అయ్యారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు అన్నదానం, రక్తదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

    ఫస్ట్‌లుక్ పోస్టర్ అదే రోజున

    ఫస్ట్‌లుక్ పోస్టర్ అదే రోజున

    మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం ఆగస్టు 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే రోజు మూవీ టైటిల్ సైతం ప్రకటించే అవకాశం ఉంది. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

    భారీ అంచనాలు

    భారీ అంచనాలు

    మహేష్ బాబు తన కెరీర్లో చేస్తున్న 25వ చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ఆగస్టు 9న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో నెం.1 స్థానంలో ట్రెండ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

    English summary
    Superstar's Super Fans revealed common DP to celebrate Superstar urstrulyMahesh's birthday on Aug 9th. Made With over 900 Photoshoot Pics Of Fans & Wishes With 43 International Languages and 24 movie posters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X