»   » ప్రభాస్ ఇంటి ముందు అభిమానుల ఆందోళన, ఏమైంది?

ప్రభాస్ ఇంటి ముందు అభిమానుల ఆందోళన, ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అంతకు ముందే ప్రభాస్ టాలీవుడ్ టాప్ యాక్టర్ల లిస్టులో ఉన్నాడు. ఈ సినిమాతో ఆయన రేంజి మరింత పెరిగింది. మేల్ ఫ్యాన్స్ తో పాటు ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.

ప్రభాస్ తన అభిమానుల కోసం వీలైనప్పుడల్లా సమయం కేటాయిస్తుంటాడు. వారితో మాట్లాడటానికి, ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపుతుంటాడు. వారితో పలు విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో అభిమానులు శుక్రవారం భారీ సంఖ్యలో ప్రభాస్ నివాసానికి చేరుకున్నారు.

Fans hulchul in front of Prabhas's house!

అయితే ప్రభాస్ సెక్యూరిటీ సిబ్బంది అభిమానులను అనుమతించక పోవడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. ప్రభాస్ ను కలవడానికి తమకు పాసులు జారీ చేసారని, అయితే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం అనుమతించడం లేదని అభిమానులు ఆందోళన చేసారు. దీంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని సర్ది చెప్పారు.

అయితే ప్రభాస్ ను కలవడానికి పాసులు ఎవరు ఇచ్చారు? ప్రభాస్ కు తెలిసే ఈ పాసులు జారీ చేసారా? ఆ సమయంలో ప్రభాస్ ఎక్కడికి వెళ్లినట్లు, ఇంత జరుగుతున్నా ప్రభాస్ ఎందుకు స్పందించ లేదు అనే సందేహాలు తెలెత్తుతున్నాయి. మరి ప్రభాస్ నుండి ఇప్పటి వరకు ఈ గొడవ విషయమై ఎలాంటి స్పందన రాలేదు.

English summary
Prabhas fans reached Prabhas’s house yesterday to meet their favorite star. But, Prabhas’s security did not allow them to meet Baahubali star. This made them anger and they protested before the house of Prabhas
Please Wait while comments are loading...