అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెట్టిన కుర్రాళ్లు: కావాలనే చేస్తున్నారా అంటూ అసహనం.. ఊహించని ఘటనతో షాక్!

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనదైన శైలి యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో డ్యాన్స్, స్టైల్స్‌తో ఆకట్టుకుంటూ స్టైలిష్ స్టార్ అయిపోయాడు. ఈ కారణంగానే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన 'చావు కబురు చల్లగా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీకి చేదు అనుభవం ఎదురైంది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి అతడికి అసహనం తెప్పించారు. ఆ వివరాలు మీకోసం!

చాలా కాలం తర్వాత ఇండస్ట్రీ హిట్‌తో సత్తా

చాలా కాలం తర్వాత ఇండస్ట్రీ హిట్‌తో సత్తా

'నా పేరు సూర్య' తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న అల్లు అర్జున్.. గత ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ భారీ మూవీ అద్భుతమైన స్పందనతో హిట్ టాక్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫలితంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని పాటలూ పలు రికార్డులు సాధించాయి.

మూడో సారి కలిశాడు.. ఈ సారి భారీ రేంజ్‌

మూడో సారి కలిశాడు.. ఈ సారి భారీ రేంజ్‌

ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' అనే సినిమాలో నటిస్తున్నాడు. 'ఆర్య', 'ఆర్య2' వంటి చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ హీరోకు మద్దతుగా నిలిచిన స్టైలిష్ స్టార్

ఆ హీరోకు మద్దతుగా నిలిచిన స్టైలిష్ స్టార్

కార్తికేయ గుమ్మకొండ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. చిత్రంతో పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బన్నీవాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమాకు సపోర్టుగా నిలిచాడు.

వాళ్లను చూసి నా మీద నాకే ఏదోలా అని

వాళ్లను చూసి నా మీద నాకే ఏదోలా అని

అంగరంగ వైభవంగా జరిగిన 'చావు కబురు చల్లగా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ స్పీచ్ ఆకట్టుకుంది. 'ఈ సినిమా ఉదయమే చూశాను. ఆ వెంటనే బన్నీ వాసును దర్శకుడి ఏజ్ ఎంత? కార్తికేయ వయసు ఎంత? అని అడిగా. 26 - 28 మధ్య ఉంటుందని చెప్పాడు. ఈ వయసులోనే వాళ్లలో కనిపించిన మెచ్యూరిటీకి ఆశ్చర్యపోయా. నాకే ఏదోలా అనిపించింది' అంటూ చెప్పాడు.

అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెట్టిన కుర్రాళ్లు

అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెట్టిన కుర్రాళ్లు

ఇక, ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ స్పీచ్ మొదలు పెట్టిన వెంటనే ఓ అభిమాని వచ్చి అతడి కాళ్లకు దండం పెట్టాడు. ఒక్క ఫొటో అన్నా అంటూ అరిచి గోల చేశాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలా చాలా మంది వచ్చి బన్నీని మాట్లాడకుండా ఇబ్బంది పెట్టారు. ఒక అభిమానైతే ఈ స్టార్ హీరోనే పడేసే అంత గట్టిగా పట్టుకున్నాడు. దీంతో స్టేజ్‌పై ఉన్న వాళ్లంతా భయపడిపోయారు.

కావాలనే చేస్తున్నారా అంటూ అసహనం

కావాలనే చేస్తున్నారా అంటూ అసహనం

తన వద్దకు వస్తున్న అభిమానులను ఉద్దేశిస్తూ.. 'ప్రతి ఈవెంట్‌లోనూ ఇలా కావాలనే వస్తున్నారా ఏంటి' అంటూ నవ్వుతూనే అసహనం వ్యక్తం చేశాడు అల్లు అర్జున్. అంతేకాదు, కాసేపు గమ్మునుండండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. అలాగే, తన దగ్గరకు వచ్చిన వాళ్లందరికీ ఇబ్బంది కాకుండా పంపించాలని తన సెక్యూరిటీని ఆదేశించాడు. ఇక, చివర్లో అందరినీ టచ్ చేస్తానని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X