పబ్లిక్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు చేదు అనుభవం: అందరిలో భయం భయం.. లైఫ్‌‌లో తొలిసారి అలా ప్రవర్తించడంతో!

నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. టీనేజ్‌లోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. రూపంలో నటనలో తాతను మరిపించేలా చేస్తున్నాడు. అందుకే నందమూరి అభిమానులతో పాటు చాలా మంది అతడికి ఫ్యాన్స్ అయిపోయారు. అందుకు అనుగుణంగానే వాళ్లందరినీ కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేస్తున్నాడతను. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌కు చుక్కలు చూపించారు అభిమానులు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

వరుసగా ఐదు.. ఇప్పటి హీరోలలో రికార్డుతో

వరుసగా ఐదు.. ఇప్పటి హీరోలలో రికార్డుతో

కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి మొదలుకొని 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను అందుకున్నాడు. దీంతో ఇప్పటి స్టార్ హీరోల్లో ఏకంగా ఐదు విజయాలు అందుకుని రికార్డులకెక్కాడు.

సినీ చరిత్రలోనే ప్రత్యేకమైన మూవీలో భాగం

సినీ చరిత్రలోనే ప్రత్యేకమైన మూవీలో భాగం

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఇందులో తారక్.. కొమరం భీంగానూ, చరణ్.. అల్లూరి గానూ నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.

పర్ఫెక్ట్ వయ్యారాలతో కనువిందు చేస్తున్న శివాని నారాయణన్

ఒకటి పూర్తవకుండానే... అవి లైన్‌లో పెట్టేసి

ఒకటి పూర్తవకుండానే... అవి లైన్‌లో పెట్టేసి

RRR షూటింగ్ జరుగుతుండగానే.. జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమాను కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నాడు తారక్. ఆ తర్వాత కూడా లిస్టు ప్రిపేర్ చేసుకున్నాడు.

అందులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న జూనియర్

అందులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న జూనియర్

గతంలో బిగ్ బాస్ షో ద్వారా హోస్టుగా అలరించిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు మరోసారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో వచ్చి సూపర్ సక్సెస్ అయిన షోను.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' పేరిట తీసుకొస్తున్నారు. జెమినీ టీవీలో ప్రసారం కానున్న దీనినే తారక్ హోస్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రోమో కూడా విడుదలైంది.

తమ్ముడి కోసం అలా... అదరగొట్టిన ఎన్టీఆర్

తమ్ముడి కోసం అలా... అదరగొట్టిన ఎన్టీఆర్

కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా నటించిన చిత్రం 'తెల్లవారితే గురువారం'. మణికాంత్ తెరకెక్కించిన ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు. వీళ్లిద్దరి కోసం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ కదిలి వచ్చాడు. ఈ సందర్భంగా అతడు ఎన్నో విషయాలపై మాట్లాడాడు. అంతేకాదు, తన తమ్ముళ్లను చూస్తే గర్వంగా ఉందంటూ చెబుతూ బెస్ట్ విషెస్ తెలిపాడు.

లైఫ్‌‌లో తొలిసారి.. అలా ప్రవర్తించడంతో కోపం

లైఫ్‌‌లో తొలిసారి.. అలా ప్రవర్తించడంతో కోపం

'తెల్లవారితే గురువారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ గెస్టుగా వస్తున్నాడని ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో సందడి మొదలైంది. ఇక, ఆదివారం ఈ వేడుకలో 'ఫ్యూచర్ సీఎం ఎన్టీఆర్' అనే ఫ్లెక్సీలే ఎక్కువగా కనిపించాయి. అలాగే, తారక్ మాట్లాడుతోన్న సమయంలో ఫ్యాన్స్ అంతా 'సీఎం సీఎం' అని కేకలు వేశారు. దీంతో లైఫ్‌లో ఫస్ట్ టైం వాళ్లపై కోప్పడ్డాడతను.

పబ్లిక్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు చేదు అనుభవం

పబ్లిక్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు చేదు అనుభవం

ఈ ఈవెంట్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. సరిగ్గా ఆ సమయంలోనే అతడిని అభిమానులంతా స్టేజ్ పైనే చుట్టుముట్టేశారు. ఏకంగా మీద పడిపోయి నలిపేశారు. అలా ఒక పక్క నుంచి మరో పక్క వరకూ అతడిని లాక్కుంటూ వెళ్లారు. దీంతో అక్కడున్న వాళ్లంతా భయపడిపోయారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది సురక్షితంగా పంపేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X