అభిమానులే నా బలం, బలహీనత...!
సినితారలకు బలం, బలహీనత రెండూ అభిమానులే అంటోంది మన అందాలభామ జెనిలియా. అంతేకాకుండా తమ అభిమాన హీరో సినిమా బాగా ఆడాలని అభిమానులు మొక్కుకుంటే, వాళ్శని ఎలా మెప్పించాలని అని తారాలోకం ఎప్పడూ కోత్తగా ఆలోచిస్తూ ఉంటారు. సినిమా విడుదల రోజు ధియేటర్లు దగ్గర బ్యానర్లే కాదు, కోంత మందికి ఐతే ఏకంగా గుళ్శు కట్టిన సందర్బాలున్నాయి. ఇలాంటి అభిమానుల్ని చూస్తుంటే నాకు యమా సరదాగా ఉంటుందని అన్నారు. అభిమానులు మన ప్రతి కదలికలను గమనిస్తుంటారు. విజయం సాధించినప్పుడు మెచ్చుకుంటారు. అలాగే పోరపాట్లు చేసినప్పుడు మన వెన్నంటే ఉంటారు. అభిమాన తారల ఆటో గ్రాఫ్ ల కోసం ఎంతగానో పరితపిస్తారు. మా లాంటి వారు ఈ రోజు ఇలా ఉన్నారంటే దానికి కారణం అభిమానులేనని గట్టగా చెబుతోంది. అందుకే వారిచ్చే సూచనలకు చాలా విలువను ఇస్తానని అంటోంది జెనిలియా. ట్విట్టర్ వచ్చిన తర్వాత ప్రతిరోజు నా అభిమానులకు అందుబాటులో ఉంటున్నాను. అలాగే ఇటీవల జరిగిన ఒక అనుభవం గురించి చెబుతూ' ఓ సారి ఏడేళ్శ అమ్మాయి నా దగ్గరికి వచ్చి, మీరంటే నాకు ఇష్టం. నా గది నిండా మీ ఫోటోలే ఉన్నాయి అని చెప్పింది. ఆ రోజు నాకు చాలా సంతోషం వేసింది. ఆ అమ్మాయి తెచ్చిన పుస్తకం మీద సంతకం పెడుతూ ఎంతగానో మురిసిపోయాను" అని చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ చరణ్ తేజ్ బాబు పక్కన ఆరంజ్ అనే సినిమాలో నటిస్తుంది.


Click it and Unblock the Notifications











