Bhagavanth Kesari: ఫుల్ బాటిళ్లతో బాలయ్యకు అభిషేకం.. చరిత్రలో ఏ హీరోకూ జరగని విధంగా.. వీడియో వైరల్

తెలుగు చిత్ర పరిశ్రమంలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. డివోషనల్ కాన్సెప్టుతో వచ్చిన 'అఖండ' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోన్న ఆయన.. 'వీర సింహా రెడ్డి'తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'భగవంత్ కేసరి' మూవీతో వచ్చారు. ఈ సినిమా విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు చేసిన ఓ వినూత్నమైన పని హాట్ టాపిక్‌గా మారింది. అసలేమైందో మీరే చూసేయండి మరి!

భగవంత్ కేసరిగా వచ్చేశారు:నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి తీసిన సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను పోషించింది. అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్‌ను చేశాడు. దీనికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Fans Mansion House Abhishekam to Balakrishna at Bhagavanth Kesari Theater

భారీ స్థాయిలో రిలీజ్ చేస్తూ:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1400లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ నందమూరి అభిమానులతో మోత మోగుతూ రీసౌండ్ ఇచ్చేస్తున్నాయి.

భగవంత్ కేసరికి టాక్ ఇలా:ఎమోషనల్ టచ్‌తో రూపొందిన 'భగవంత్ కేసరి' మూవీకి సంబంధించి ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కొన్ని షోలు ప్రదర్శితం అయ్యాయి. అన్ని చోట్లా దీనికి మంచి టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే ప్రీమియర్స్, ఎర్లీ మార్నింగ్ షోలకు భారీ స్పందన లభించింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. అలాగే, ఈరోజు బుకింగ్స్ బాగా పెరుగుతున్నాయి.

Fans Mansion House Abhishekam to Balakrishna at Bhagavanth Kesari Theater

ఓపెనింగ్స్ భారీగా అంటూ:నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీకి ఓవరాల్‌గా మంచి టాక్ వచ్చింది. కానీ, అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం భారీ స్థాయిలో వస్తోంది. దీంతో ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే బుకింగ్స్ అయ్యాయి. ఫలితంగా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను సొంతం చేసకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.

మందుతో అభిషేకం చేసి:విభిన్నమైన కాంబినేషన్‌లో వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే దక్కుతోంది. ఫలితంగా థియేటర్లు అన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. ముఖ్యంగా బాలయ్య అభిమానులు దీన్ని పండుగలా సెలెబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆయన పోస్టర్‌కు మందుతో అభిషేకం చేశారు.

Fans Mansion House Abhishekam to Balakrishna at Bhagavanth Kesari Theater

ఏ హీరోకూ జరగని విధంగా:నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీ బెంగళూరు సిటీలోనూ భారీగా రిలీజ్ అయింది. అక్కడ అభిమానులు ఓ రేంజ్‌లో సెలెబ్రేషన్స్ చేశారు. ఇందులో భాగంగానే ఓ థియేటర్‌లో ఏర్పాటు చేసిన బాలయ్య పోస్టర్‌కు కొందరు మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిళ్లతో అభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X