అభిమానుల వీరంగం, బెంబేలెత్తిన హీరోయిన్
హైదరాబాద్: సినీతారలకు పబ్లిక్‌లో రక్షణ ఉండదని మరోసారి రుజువైంది. తెరపై స్టార్స్ ఆట పాటలు, పెర్ఫార్మెన్స్ చూసి ముచ్చటపడే ఫ్యాన్స్......అదే సినీతారలు తమ మధ్యలోకి వస్తే మాత్రం వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. హీరోయిన్ హన్సికకు ఇటీవల చెన్పైలో అలాంటి అనుభవమే ఎదురైంది.
సినిమా చూడటం కోసం చెన్నైలోని 'సినిమాస్ ఎట్ ఎక్స్ ప్రెస్ వెన్యూ'కు వెళ్లిన హన్సిక తీవ్రంగా ఇబ్బంది పడింది. సినిమా థియేటర్‌కు వచ్చిన ఆమె వెంట సెక్యూరిటీ సిబ్బంది లేక పోవడంతో కొందరు ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. ఆమెను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ పిచ్చెక్కినట్లు ప్రవర్తించారు.
తనకు నచ్చిన సినిమాలను థియేటర్లకు వెళ్లి చూడటం హన్సికకు అలవాటు. ఆమె ఎప్పుడూ వచ్చినా ఆమె వెంట సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు తప్పక ఉంటారు. గతంలోనూ ఆమెకు అభిమానుల నుండి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యారు.

టచ్ చేస్తూ ఇబ్బంది పెట్టారు
కొందరు అభిమానులు ఆమె చుట్టూ చేరి ఆమె అనుమతి లేకుండా హె శరీరాన్ని టచ్ చేస్తూ, ఆమెపై చేతులు వేస్తూ ఇబ్బంది పెట్టారు.

హన్సిక డిస్పప్పాయింట్
అభిమానులంటే హన్సిక ఇష్టమే. కానీ వారు ఇలా తనను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి ఇబ్బందే..
హన్సికకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. ఈసంవత్సరం ఏప్రిల్ నెలలో గోవా వెళ్లినపుడు కూడా హన్సిక ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొన్నారు. ఆటోగ్రాఫ్స్ కావాలంటూ వచ్చి ఆమెను ఆగమాగం చేసారు.

కోయంబత్తూర్లో కూడా...
గతంలో ఓసారి కోయంబత్తూరుకు వెళ్లిన సమయంలోనూ హన్సిక పట్ల కొందరు అభిమానులు మిష్ బిహేవ్ చేసారు.

హన్సిక నటిస్తున్న సినిమాలు
హన్సిక ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తమిళంలో వాలు, ఉయిరే ఉయిరే, మేగమన్, రోమియో జూలియట్, తెలుగులో పవర్ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











