twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ప్లస్, మైనస్ పాయింట్స్ అంటూ...పాఠకుల కామెంట్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ తెరంగ్రేటం గురించి అభిమానులు, పాఠకులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొందరు ఆయన రాజకీయాల్లోకి రావాలని, మరికొందరు ఆయన సినిమాల్లోనే కొనసాగాలని, మరికొందరు కొత్త పార్టీ పెట్టాలని, ఇంకొందరు ఇతర పార్టీల్లో చేరాలని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

    తెలుగు వన్ ఇండియా పోల్‌లో బుధవారం సాయంత్రం వరకు 17,103 ఓట్లకుగాను 9,705(57%) మంది పవన్ పార్టీ పెట్టాలని ఓటేసారు. 6,720(39%) మంది పార్టీ పెట్టొద్దని ఓటేసారు. 678(4%) మంది చెప్పలేం అని ఓటేసారు.

    పవన్ కళ్యాణ్‌తో 'తీన్‌మార్' చిత్రం తెరకెక్కించిన దర్శకుడు జయంత్ సి. పర్జానీ కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావొద్దని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సోషల్ నట్వర్కింగ్ ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఈ బుదర రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని సూచించారు.

    మరికొందరు పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అందుకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.

    1. హరికృష్ణ ఆల్లెన చెప్పిన అభిప్రాయం....
    పవన్ కళ్యాణ్ ప్లస్ పాయింట్స్
    -పాజిటివ్ ఆటిట్యూడ్
    -స్ట్రాంగ్ కమిట్ మెంట్
    -భారీ ఫ్యాన్ ఫాలోయింగ్
    -హెల్పింగ్ నేచర్

    పవన్ మైనస్ పాయింట్స్
    - దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయ పడతారు
    -ముక్కుసూటి తనం అధికం
    -షార్ట్ టెంపర్డ్
    ఆయన ఒక మంచి పార్టీలో జాయినై గుడ్ లీడర్‌గా పేరు తెచ్చుకోవాలి.

    2. సుచిత్ర చెప్పిన అభిప్రాయం..
    రాజకీయాల్లోకి రాకుండా ప్రజలకు సేవ చేయాలి.

    3. దినేష్
    పవన్ కళ్యాణ్ రాజకీయల్లోకి రావద్దు.

    4. కమల్
    పవన్ కళ్యాణ్ గారు దయచేసి రాజకీయాల్లోకి రావద్దు. ఈ రాజకీయాలు మీకు సూట్ కావు.

    5. సుబ్బు
    కొత్త పార్టీ పెట్టడం కన్నా ఆమ్ఆద్మీ పార్టీలో చేరడం బెటర్

    6. శివ
    పవన్ కళ్యాణ్ గారు... మీకీ చీడ రాజకీయాలు వద్దు. కండువా ముసుగులో కుల్లు,కుతంత్రాలతో పేరుకుపోయిన ఈ టోపి వ్యవస్థ మీలాంటి సున్నిత హృదయులకు సరిపడదు. మీ నిరాండబరత నేటి యువతకు ఓ ఆదర్శం. ఏ విధమైన ప్రచార, ఆర్భాటాలను ఆశించికుండా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు మాకెంతో ప్రోద్భలాన్నిస్తున్నాయి. నీచ రాజకీయాలకు దూరంగా ఉంటూనే నవ సమాజ నిర్మాణానికి మీరు కృషి చేస్తారని భావిస్తున్నాం...

    7. రవిబాబు రావి...
    పవన్ కళ్యాణ్ లోక్ సత్తా పార్టీలో చేరడం బెటర్.

    8. సత్య
    పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలి. నిజాయితీగా రాజకీయాలు చేయాలి.

    9. హరిష్ పవన్ (వైజాగ్)
    పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావొద్దు. రాజకీయాలకు దూరంగా ఉండండి.

    10. ఎవి.సుబ్బరావు
    ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఉత్తమం. ఇదే సమరైన సమయం.

    English summary
    Fans opinion about Pawan Kalyan political entry. Several speculations have been doing rounds about Power Star Pawan Kalyan's new political entry and his new party ever since he released a press statement saying that he would answer all questions related to his political career in the second week of March. If we are to believe the insiders of the Telugu film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X