ఫస్ట్ హాండ్ రిపోర్ట్ - ‘బిజినెస్ మేన్’ పై ప్రేక్షకులు..
మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇటీవల వచ్చిన దూకుడు భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'బిజినెస్ మేన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు కూడా విడుదలపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో మహేష్ బాబు-పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'పోకిరి' సినిమా భారీ విజయం సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఇది కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో బిజినెస్ మ్యాన్ మార్నింగ్ షో చూసిన వారి అభిప్రాయాలు సేకరించింది వన్ ఇండియా.కామ్. మరి సినిమాపై వీక్షకుల అభ్రిప్రాయాలు ఎలా ఉన్నాయో... ఒకసారి చూద్దాం.
మహేష్ బాబు యాక్టింగ్ సూపర్ గా ఉంది. డైలాగ్ డెలివరీ అద్భుతం. సినిమా రికార్డులు సృష్టించడం ఖాయం-విక్రమ్ సినిమా వినోదాత్మకంగానే ఉంది. మహేష్ బాబు కోసం చూడొచ్చు. అయితే క్లైమాక్స్ మాత్రం అంత బాగొలేదు. సినిమా ఓకే-ప్రశాంత్. మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ యాక్టింగ్, డాన్ కావాలనే దూకుడు ఆకట్టుకుంది-రాజశేఖర్ సినిమా బాగుంది. అయితే కొన్ని సీన్లు లాజిక్ లేకుండా ఉన్నాయి. పాటలు బాగున్నాయి-రాజేందర్. దూకుడు సినిమాతో పోలిస్తే బిజినెస్ మ్యాన్ పూర్తి వినోదాత్మకంగా లేదు. డిఫరెంట్ గా ఉంది కానీ, కామెడీ పాళ్లు కూడా ఉంటే సినిమా ఇంకా బాగుండేది-రాజు గుండు.


Click it and Unblock the Notifications











