twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేరుచేసి మాట్లాడొద్దు: పవన్ 50 లక్షల విరాళంపై ఫ్యాన్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హుధూద్ తుఫాన్ బాధితులకు రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకోవడంపై పలువురు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ దారిలో మేము సైతం అంటూ విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆయన పిలుపు మేరకు తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తమకు చేతనైన సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తానని పవన్ కళ్యాన్ చెప్పడంతో పలువురు అభిమానులు సైతం విశాఖ బయల్దేరడానికి సిద్ధమయ్యారు.

    పవన్ కళ్యాణ్ విరాళంపై పలువురు అభిమానులు సోషల్ నెట్వర్కింగులో ఇలా స్పందించారు...

    గుడివాడ సాయిరామ్

    గుడివాడ సాయిరామ్

    మరోసారి పవన్ కళ్యాణ్ తన దాన గుణం చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ నమ్మిన ప్రజలను ఎప్పుడూ మోసం చేయడు. ఇందాక అబ్బాయి, ఇపుడు బాబాయ్ సహాయం చేసారు. మెగా ఫ్యామిలీ అంటే ఇది. ఎవరూ వేరు చేసి మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ డొనేట్ చేసినా, చిరు డొనేట్ చేసినా, నాగబాబు డొనేట్ చేసినా ఏదైనా ఒకటే బ్లడ్..ఒకటే ప్యామిలీ.

    అవినాష్ పులి

    అవినాష్ పులి

    పవన్ కళ్యాణ్ 50 లక్షలు డొనేట్ చేసారు. ఆయన తన సహాయగుణాన్ని మరోసారి చాటుకున్నారు.

    సత్య ప్రకాష్

    సత్య ప్రకాష్

    పవన్ కళ్యాణ్ 50 లక్షలు విరాళం ఇచ్చారు. వ్యక్తిగతంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. అభిమానులకు పిలుపునిచ్చారు......ఆయన నిజంగా దేవుడు.

    సంతోష్ కుమార్ లోకల్ పవర్ స్టార్

    సంతోష్ కుమార్ లోకల్ పవర్ స్టార్

    హుధూద్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ కోసం పవన్ కళ్యాణ్ 50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆయన అభిమానిని అయినందుకు నేను గర్విస్తున్నాను.

    పవన్ కుమార్ ఎఎస్ఎఫ్ జనసేన

    పవన్ కుమార్ ఎఎస్ఎఫ్ జనసేన

    పవన్ కళ్యాణ్ 50 లక్షలు డొనేట్ చేసారు. వైజాగ్‌లో పర్యటిస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది.

    మణి మడిశెట్టి

    మణి మడిశెట్టి

    పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు డొనేట్ చేసారు. మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు.

    వికాస్ బట్టుల

    వికాస్ బట్టుల

    పవన్ కళ్యాణ్ 50 లక్షల విరాళం ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆయనంటే ఏమిటో మరోసారి రుజువైంది.

    మధు చంద్

    మధు చంద్

    పవన్ కళ్యాణ్ 50 లక్షలు స్పాన్సర్ చేసారు. సూపర్

    గోపాల్ అమిలినేని

    గోపాల్ అమిలినేని

    పవన్ కళ్యాన్ తన పెద్ద మనసు మరోసారి చాటు కున్నారు.

    ఇలా పలువురు అభిమానులు పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షల సహాయంపై తమదైన రీతిలో స్పందించారు.

    English summary
    Pawan Kalyan's big donation to Hudhud Victims. Fans Praises Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X