Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మెగా డాటర్‌పై నెటిజన్స్ ఫైర్.. ఆమె హాట్ ఫొటోలు చూసి ఎలా రియాక్ట్ అవుతున్నారంటే!
మెగా డాటర్ కొణిదెల నిహారిక ఈ మధ్యకాలంలో మోడ్రెన్‌గా తయారై చాలా హాట్‌గా కనిపిస్తోంది. ఇప్పటిదాకా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించి ఆకట్టుకున్న ఆమె ట్రెండ్ ఫాలోకాక తప్పదని డిసైడ్ అయినట్లుంది. ఈ మేరకు తన హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే నిహారిక ఇలా హాట్ ట్రీట్ ఇవ్వడం పట్ల కొందరు నెటిజన్లు స్పందిస్తూ సూచనలిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దామా..
|
బ్రేక్ రాలేదు కానీ.. గుర్తింపు వచ్చింది
మెగా ఫ్యామిలీ నుంచి సినీ గడపతొక్కిన నిహారిక.. తన అందంతో, క్యూట్‌నెస్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా మంచి గుర్తింపు మాత్రం సంపాదించింది. కాకపోతే సినిమాల పరంగా ఆమెకు సరైన బ్రేక్ రాకపోవడం కాస్త నిరాశ కలిగించింది.
|
హీరోయిన్ కావాలనే ఆకాంక్షతో..
హీరోయిన్ కావాలన్న బలమైన ఆకాంక్షతో రంగంలోకి దిగిన నిహారిక.. మొదట 'ఒక మనసు' సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టలేదు. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' లాంటి సినిమాలు చేసినప్పటికీ నో రిజల్ట్. ఇక ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి'లో కూడా చిన్న పాత్ర పోషించింది. ఇవేవీ ఆమె కెరీర్‌కి కలసి రాలేదనే చెప్పుకోవాలి.
|
నిహారిక మోడ్రెన్ లుక్స్.. వెరీ వెరీ హాట్
అయినప్పటికీ తన పాపులారిటీకి మచ్చరాకుండా ఉండేలా మోడ్రెన్ ట్రెండ్ ఫాలో అవుతోంది నిహారిక. ఇటీవలే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసి వార్తల్లో నిలిచింది ఈ మెగా డాటర్. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఆమె వెరీ వెరీ హాట్ దుస్తుల్లో కనిపించడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
|
నిహారిక తీరుపై నెటిజన్ల రియాక్షన్
ఈ ఫొటోల్లో నిహారిక గ్లామర్ చూసి ఇకపై ఆమెకు వరుస ఆఫర్స్ ఖాయం అన్నారు కొందరు నెటిజన్లు. కానీ ఇంకొందరు మాత్రం నిహారిక తీరును తప్పుబడుతున్నారు. మెగా వారింటి ఇమేజ్ ఉన్నా కూడా ఇలా అందాల ఆరబోత చేస్తూ అట్రాక్ట్ చేయడం సరికాదంటూ ఆమెకు ట్వీట్స్ చేస్తున్నారు. ఆఫర్స్ కోసం నువ్వు కూడా ఈ దారిలోకి రావొద్దు అంటూ ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నారు.
వాటిపైనే మెగా డాటర్ స్పెషల్ ఫోకస్..
ఇకపోతే నిహారిక ప్రస్తుతం వెబ్ సీరిస్‌లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 'పింక్ ఎలిఫెంట్' పేరుతో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించిన నిహారిక.. ఇదే బ్యానర్‌పై 'నాన్నకూచి', 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్‌లను నిర్మించిన సంగతి తెలిసిందే. కెరీర్ ఇలాగైనా టర్న్ చేసుకోవాలనే కోణంలో కొత్త వెబ్ సీరిస్‌ల నిర్మాణం చేపట్టింది మెగా డాటర్.