»   » పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తూనే ఉంటాం, ఫ్యాన్స్ నోట్

పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తూనే ఉంటాం, ఫ్యాన్స్ నోట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది. అన్న లెజెనివా అనే విదేశీ భామను పవన్ మూడో వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 30న ఎర్రగడ్డ రిజిస్టర్ ఆఫీసులో వీరి వివాహం రిజిస్టర్ అయింది. సబ్ రిజిస్టార్ బసిత్ సిద్ధిఖి కూడా మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ తొలుత నందిని అనే అమ్మాయిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆమె నుండి విడాకులు తీసుకున్న పవన్ 'బద్రి' సినిమాలో తనతో నటించిన రేణు దేశాయ్ తో సహజీవనం చేసి పిల్లలను కన్నాక రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి అకీరా నందన్, ఆద్యా అనే ఇద్దరు సంతానం. ఇప్పుడు రేణుతో సైతం విడిపోయి అన్నా లెజెనివాను మూడో వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.

ఈ పరిణామాల నేపథ్యంలో......పవన్ కళ్యాణ్‌పై పలువురు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పవన్ అభిమానులు ఆయనకు మద్దతుగా నిలిచారు. సోషల్ నెట్వర్కింగు ద్వారా ఎదురు దాడికి దిగారు. పవన్‌పై విమర్శలు చేసే వారిపై పదునైన పదజాలంతో విరుచుకు పడుతున్నారు.

Fans says, We Love Pawan Kalyan

అభిమానుల నోట్
'దురాభిమానులారా వినండి..., లక్ష కోట్లు అవినీతితో సంపాదించిన వారికి మీరు అభిమానులు. ఆ అవినీతి నాయకులకు చేయెత్తి మద్దతు తెలిపి దానికి ప్రతిగా వేల కోట్ల రూపాయల స్థలాలు పొందిన ఫేక్ రికార్డుల హీరోలకు మీరు అభిమానులు. అన్నం పెట్టే నిర్మాతలను చంపే హీరోలకు, నమ్మిన వారిని వెన్ను పోటు పొడిచే నాయకులకు మీరు అభిమానులు, విటన్నింటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధపడే వారు ప్రజలు. తాను చేసిన పనికి తాను మాత్రమే బాధపడి, ఎదుటి వారి బాధ నివారిణికి అన్ని చర్యలు తీసుకుని...తాను చేసే పని తప్పయినా, ఒప్పయినా నిజాయితీతో బాధ్యత వహించే మా పవన్‌ని మేము గర్వంతో అభిమానిస్తూ...ప్రేమిస్తాం...ప్రేమిస్తూనే ఉంటాం'

English summary
Pawan Kalyan’s fans are backing up their Power star with the third marriage news of Pawan Kalyan with an Australian girl Anna. In Face book there is a note supporting Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu