డిఫరెంట్ లుక్ లో కళ్యాణ్ రామ్, షాక్ అవుతున్న అభిమానులు!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుస మూవీలు చేస్తున్నాడు. ఈ హీరో తాజాగా నటించిన సినిమా నా నువ్వే మే 25వ తేదిన విడుదల కానుంది. ఇక తన తదుపరి మూవీని సినిమాటోగ్రాఫర్ గుహన్దర్శకత్వంలో చేయనున్నాడు.ఈ సినిమా ఇటీవలే లాంచనంగా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈరోజు కళ్యాణ్ రామ్ కొత్త మెకోవర్ బయటకొచ్చింది. ఈ ఫోటోలో కళ్యాణ్ రామ్ కొద్దిగా రఫ్ లుక్లో మ్యాన్లీగా కనిపిస్తున్నారు. సినిమా కోసం పూర్తి న్యూ లుక్ లోకి మారిపోయిన కళ్యాణ్ రామ్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరించనున్నారు. విభిన్నమైన కథ, కథనాలతో రూపొందించబడుతున్న ఈ సినిమా అధికభాగం షూటింగ్ అమెరికాలో చిత్రీకరించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. గుహన్ ఇటీవలే సాయిధరమ్ తేజ్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన 'జవాన్' చిత్రానికి కెమెరామెన్ గా పనిచెయ్యడం జరిగింది.


Click it and Unblock the Notifications











