twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shame on Samantha: అక్కినేని కోడలు పై దారుణంగా ట్రోలింగ్.. నెటిజన్ల ఎదురుదాడి..

    |

    ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ వెబ్ కంటెంట్ కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. సీజన్ 1 తోనే ప్రేక్షకుల్లో ఒక అంచనాల డోసును పెంచేసింది. ఇక సీజన్ 2 హ్యాపీగా ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోందని అనుకునే టైమ్ లో ఒక్కసారిగా తమిళ ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడం అందరిని షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా సమంతపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ఏ సమయంలో అయినా రిలీజ్ కావచ్చని సమాచారం రావడంతో మరోసారి ట్రోలింగ్స్ డోస్ పెంచారు.

    దారుణంగా తిట్టిపోస్తున్నారు

    దారుణంగా తిట్టిపోస్తున్నారు

    తమిళ జనాల కోసం ఎంతగానో పోరాడిన టైగర్ సైన్యాన్ని దారుణంగా అవమనీస్తూ సమంత పాత్రను తీర్చిదిద్దినట్లు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఒక ఉగ్రవాద పాత్రలోనే సమంత పాత్రను డిజైన్ చేసినట్లు ఉందని తమిళ జనాలు సోషల్ మీడియాలో దారుణంగా తిట్టిపోస్తున్నారు.

    పూర్తిగా చూసిన తరువాత మాట్లాడండి

    పూర్తిగా చూసిన తరువాత మాట్లాడండి

    ఇక తమిళ జనాల తిట్ల ట్యాగ్స్ కు కాస్త కంగారుపడిన దర్శకులు రాజ్ అండ్ డీకే అలాగే మరికొందరు నటీనటులు వెంటనే క్లారిటీ ఇచ్చారు. వెబ్ సిరీస్ పూర్తిగా చూసిన తరువాత మాట్లాడండి. చూడకముందే అపార్ధం చేసుకోవద్దని ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని అన్నారు. తమిళ జనాలు కొందరు అనవసరంగా అనుమానాలు పెంచుకోవద్దని కూడా రిక్వెస్ట్ చేశారు.

     సమంతపై దారుణంగా ట్రోలింగ్

    సమంతపై దారుణంగా ట్రోలింగ్

    ఇక వివాదంలో సమంతపై ఎక్కువగా టార్గెట్ చేశారు. ట్రైలర్ విడుదలైనప్పుడే బ్యాన్ చేయాలని సమంతపై కూడా విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు సిరీస్ విడుదలకు సిద్ధమైనట్లు తెలియగానే మరోసారి #ShameonSamantha అనే ట్యాగ్ ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఎలాగైనా వెబ్ సిరీస్ ను అడ్డుకోవాలని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

    అభిమానుల ఎదురుదాడి

    అభిమానుల ఎదురుదాడి

    ఇక సమంతపై ట్రోలింగ్స్ ఎక్కువ కావడంతో ఆమె అభిమానులు సైతం నెగిటివ్ కామెంట్స్ చేసే వారిపై ఎదురుదాడికి దిగారు. #Wesupportsamantha ట్యాగ్ ను నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. సమంతపై అనవసరంగా ట్రోలింగ్స్ చేయడం సరికాదని అంటూ వెబ్ సీరీస్ చూసిన తరువాత ఒక నిర్ణయానికి రావాలని కౌంటర్ ఇస్తున్నారు.

    Recommended Video

    #HappyBirthdaySamanthaAkkineni : Samantha Birthday Special Story | Filmibeat Telugu
    సైలెంట్ గా రిలీజ్ చేస్తారా?

    సైలెంట్ గా రిలీజ్ చేస్తారా?

    ది ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదల అవుతుందా లేదా అని అందరిలో ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అయ్యింది. కానీ మేకర్స్ విడుదల విషయంలో పెద్దగా టెన్షన్ లేనట్లే ఉన్నారని టాక్ వస్తోంది. అనుకున్న సమయానికి ఈ అర్ధరాత్రి ఎప్పుడైనా మొదలు కావచ్చని టాక్ వస్తోంది. ఇక ఇప్పటివరకు సమంత ఈ వివాదంపై ఒక్కసారి కూడా స్పందించింది లేదు. ప్రమోషన్స్ కూడా చేయడం లేదు. మరి ద ఫ్యామిలీ మ్యాన్ 2 అనుకున్న సమయానికి వస్తుందో రాదో చూడాలి.

    English summary
    It is learned that Samantha, who has not stepped up much of the controversy, has recently accidentally faced criticism from The Family Man 2. Fans seems to have reacted wisely to the matter
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X